డంప్ యార్డు కాలుష్యంతో ఎముకల గూళ్ళగా మారుతున్నా ప్రజలు

- మేడ్చల్ నియోజకవర్గం బిజెపి నేత కొంపల్లి మోహన్ రెడ్డి ఆందోళన -  సమస్య పరిష్కారానికి పోస్ట్ కార్డు ఉద్యమానికి పిలుపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మేడ్చల్ నియోజకవర్గం లోని జవహర్ నగర్ డంప్ యార్డు కాలుష్యం మూలంగా డంప్ యార్డు పరిసర ప్రాంతాలలోని ప్రజల బ్రతుకులు ఎముకల గూళ్ళగా మారుతున్నాయని మేడ్చల్ నియోజకవర్గం బిజెపి నేత కొంపల్లి మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. ఈ మేరకు జవహర్ నగర్ డంప్ యార్డు కాలుష్యం బారిన పడుతున్న దమ్మాయిగూడ పట్టణ ప్రజానీకానికి ఆయన  భహిరంగ లేఖ రాసారు. అనేక ఏళ్లుగా పాలకులుగా ఉంటున్నవారు కండువాలు మార్చి బోగా,భాగ్యాలు, అనుభవిస్తున్నారు కానీ వారికి ప్రజల ద్వారనే ఆ పదవులు,వచ్చాయి అనే కనీస ఇంగితజ్ఞానం లేకుండా ఒక్కో సమస్యను తరాల తరబడి నాన్చుతూ ఉండడంవల్ల ఈ ప్రాంతంలో నివసించే మీ’ అందరి జీవితం అన్ని రకాల కాలుష్యాలతో సావాసం చేస్తూ శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు దీర్ఘ కాలిక వ్యాధులు సంభవిస్తూ ఈ జీవితాలు ఎముకల గూళ్ళ లాగా తయారవుతున్నాయని పేర్కొన్నారు.

ఈ విషయం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది,ఈ దుర్బర జీవితాన్ని మార్చడంలో శాసనవ్యవస్థ ఎమ్మేల్యేలు – మరియు కార్యనిర్వహక వ్యవస్థ (అధికారులు) నిర్ణయాలు తీసుకొని మీ జీవితాలలో వెలుగులు నింపే విషయంలో పాలసీ పెరాలసిస్ (నిర్ణయాల అమలులో పక్షవాతం)లా ఈ డంప్ యార్డు వల్ల ఏర్పడే కాలుష్య సమస్యలకు పరష్కారం లభించడం లేదని మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

నేను ఈ సమస్యపై మా బిజెపి పార్టీ పక్షాన దశాబ్దాలుగా అనేక ప్రజా పోరాటాలు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మీ’జీవన ఘోషను వినిపించి డంప్ యార్డును ఎత్ధివేసే దిశగా ఉత్తర్వులు తెచ్చినా.. పాలకుడికి ప్రజల కన్నా పరాయి పెట్టుబడిదారుల ప్రయోజనాలే ముఖ్యం అయినాయని పేర్కొన్నారు.ఇక ఈ సమస్యను చెడుపై మంచి గెలిచిన నరకాసుర సంహారం చేసిన విధంగా గెలిచి మీ’ జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలి అంటే ప్రజాస్వామ్యంలో 4 స్థంభాల్లాంటి రెండు వ్యవస్థలు శాసనవ్యవస్థ (ఎమ్మేల్యేలు) మరియు కార్యనిర్వహక వ్యవస్థ (అధికారులు) విఫలం అయినా!! మిగిలిన 2 వ్యవస్థలు న్యాయ వ్యవస్థ మరియు పాత్రికేయ వ్యవస్థ ఇప్పటికీ క్రియాశీలకంగా ఉంటూ ప్రజల పక్షాన నిలుస్తున్నాయి కాబట్టి..!మీ సమస్యలను ఆ రెండు వ్యవస్థల గుండెను చేరి అంతిమ విజయం సాధించేలా మీ మున్సిపాలిటిలోని ప్రతీ పౌరుడు కాలుష్య కోరల్లో చిక్కుకున్న తమ గోడును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఉత్తరాల ద్వారా తెలియజేసే కార్యక్రమాన్ని చేపడదామని అని మీ అందరితో మనవి చేస్తున్నాని పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో దేశం కొరకు వీరోచితంగా పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు విశ్వసించిన ఉన్నత ఆశయంతో ఉద్యమిస్తే,అపజయం కూడా దిగ్విజయం అవుతుంది అన్న మాటలే మన ఈ పోస్ట్ కార్డు ఉద్యమానికి కొంపల్లి మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.