గొప్పలు తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్; బీఆర్ఎస్‌ గొప్పలు చెప్పుకోవడం తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ బడ్జెట్‌తో బలహీన వర్గాలకు ఒరిగిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రుణ మాఫీ ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. హరీష్‌రావు అంకెల గారడి, మాయమాటలు తప్ప బడ్జెట్‌లో ఏమీలేదని విమర్శించారు. గత బడ్జెట్ హామీలే ఇప్పటికీ అమలు కాలేదని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హామీలతోనే కేసీఆర్‌ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందన్నారు

Leave A Reply

Your email address will not be published.