బడ్జెట్ లో డ్వాక్రా మహిళల కి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతోనే BRS కు మహిళల పట్ల చిత్తశుద్ది అర్థమయ్యింది

- బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: డ్వాక్రా మహిళలకు సంబంధించిన వడ్డీలేని రుణాల బకాయిలు, అభయ హస్తము డబ్బులు, స్రీ నిధి రుణాల వడ్డీ డబ్బులు వెంటనే మహిళల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ *మరో మారు – మహిళా పోరు* లో బాగంగా 2వ రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద “బతకమ్మ “కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేయటం జరుగింది.

ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ నిన్న ఎన్నికల బడ్జెట్ గా ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి BRS పార్టీ గొప్ప గా చెప్పుకుంటున్న బడ్జెట్ లో వడ్డీ లేని రుణాలకు కేటాయించింది 1500 కోట్లు మాత్రమేనని, ఇప్పటికే బకాయిలు సుమారు 6వేల కోట్లు అయితే 1500 కోట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. గత బడ్జెట్ లో కూడా1250 కోట్లు కేటాయించి పైసా ఇయ్యలేదని గుర్తు చేశారు. CM దగ్గర ఉంచుకున్న 10 వేల కోట్ల నుండి మహిళలకు వడ్డీ లేని రుణాలు వెంటనే చెల్లించాలనీ డిమాండ్ చేశారు. బడ్జెట్ లో డ్వాక్రా మహిళల కి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతోనే BRS కు మహిళల పట్ల చిత్తశుద్ది అర్థమయ్యిందనీ అన్నారు. రైతు రుణ మాఫీ అని ప్రతి బడ్జెట్లో పెడుతున్న ఇప్పటికీ రుణ మాఫీ కాలేదని, బడ్జెట్ అంతా BRS నాయకులు లెక్కలు చెప్పుకోవడానికి సరిపోయింది తప్ప ప్రజలకు వోరిగింది ఏమీ లేదని అన్నారు. మహిళల ఖాతాల్లో డబ్బులు జమయ్యే వరకు రోజుకో నిరసన తెలుపుతామని అన్నారు. వారికి అండగా బీజేపీ ఉంటుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.