పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ

- టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ ధనదాహంతో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. తెలంగాణ లో అతిపెద్ద కుంభకోణం పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో జరిగిందని ఆరోపించారు. ప్రభాకరరావు, రఘుమారావు, గోపాలరావులను అడ్డంపెట్టుకుని కేసీఆర్ వేలకోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పవర్ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్ళ పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.ఎవరూ ఏసీడీ ఒక్క రూపాయి కూడా ఛార్జీలను చెల్లించకండి అంటూ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేశారు. అందరం కలసి పోరాడదామని.. కేసీఆర్ మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏసీడీ ఛార్జీలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ వైఫల్యంతోనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు. రాష్టంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ ప్రభుత్వం దోపిడీకి పాల్పుడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యుత్ కుంభకోణం పై విచారణ జరుపుతామని తెలిపారు. ప్రభాకరరావు, రఝుమారావు, గోపాలరావులను ఊచలు లెక్కబెట్టిస్తామన్నారు. ఈ కుంభకోణంలో భాగస్వాములైన తారకరామారావు, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావులకు శిక్ష తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.