భర్త చేతిలో హత్యకు గురైన భార్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భర్త చేతిలో భార్య హత్యకు గురైన ఘటన బిర్కూర్ మండలకేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. బాన్సువాడ సిఐ మురళి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిర్కూర్ మండలకేంద్రంలోని చాకలి గంగవ్వ అనే మహిళను ఆమె భర్త గంగాధర్ గొడ్డలితో హతమార్చాడు. గంగాధర్ కు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని గత రెండు రోజుల క్రీతం మృతురాలు గంగావ్వ తన కుటుంబ సబ్యులతో పంచాయతి పెట్టించగా ఈ విషయంలో ఇరువురికి గొడవ జరగడంతో గంగాధర్ ఆవేశంతో గొడ్డలితో భార్య గంగవ్వనుహతమార్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.