ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను సీబీఐ అరెస్టు చేసే అవకాశం?

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: మద్యం కుంభకోణం కేసులో సిబిఐ దుఉకుడు పెంచింది.లిక్కర్‌ స్కాంపై గతంలో దాఖలు చేసిన చార్జిషీట్లలోనూ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. ఈ నేపథ్యంలోనే కవిత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో కవితకు త్వరలోనే మరోసారి నోటీసులిచ్చే అవకాశాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థల వర్గాలు పేర్కొంటున్నాయి.ఈసారి నోటీసులు జారీ చేసి నేరుగా ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించనున్నట్లు చెబుతున్నాయి. గతంలో ఇచ్చిన సమాచారం, ఆ తర్వాత జరిగిన అరెస్టులు, దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు కవితను ప్రశ్నించనున్నట్లు పేర్కొంటున్నాయి. విచారణ అనంతర పరిణామాల నేపథ్యంలో.. తదుపరి చర్యల్లో భాగంగా కవితను సీబీఐ అరెస్టు చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషిస్తున్నాయి. లిక్కర్‌ స్కాం కేసులో వరుస పరిణామాలు కవితకు ఇబ్బందికరంగా మారాయని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఆదివారం శాసన మండలిలో కవితను ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్‌ కలిశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్సీ ఆందోళనతో కనిపించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.