గ్రామ సచివాలయ నిర్మాణాలకు నరేగా నిధుల వ్యయంపై అఫిడవిట్ దాఖలు

- కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖకు హైకోర్టు ఆదేశాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గ్రామ సచివాలయ నిర్మాణాలకు నరేగా నిధుల వ్యయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల ఆవరణలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణంపై విచారణ జరిగింది. గ్రామ సచివాలయాలు పంచాయతీరాజ్ చట్టం పరిథిలో లేవని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సచివాలయాలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. గ్రామ సచివాలయ నిర్మాణాలకు నరేగా నిధులు ఎలా వినియోగించారని హైకోర్టు ప్రశ్నించింది. నరేగా నిధుల వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చిందా అని జస్టిస్ భట్టు దేవానంద్ ప్రశ్నించారు. అలాగే కేంద్రగ్రామీణ అభివృద్ది శాఖకు ఏమైనా లేఖ రాశారని కోర్టు ప్రశ్నించింది. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.