వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ ‘కెప్ట్ మెసేజ్’ ఫీచర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందులో వాట్సాప్.. ఈ రెండూ లేనివారు ఇప్పుడు టార్చిలైటు వేసి వెతికినా కనిపించరు. ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌ను వాట్సాప్(తరచూ అప్‌డేట్ చేస్తూ సరికొత్త ఫీచర్లను జోడిస్తోంది. ఇప్పుడు ‘కెప్ట్ మెసేజెస్’ పేరుతో మరో నయా ఫీచర్‌ను తీసుకొచ్చింది.‘డబ్ల్యూఏబీటా ఇన్ఫో’ప్రకారం.. కొన్ని నిర్దిష్ట సందేశాలు డిసప్పియర్ కాకుండా ఉండడంతోపాటు గ్రూప్‌ చాట్‌లోని ప్రతి ఒక్కరికీ, ఎప్పటికీ అవి కనిపించాలనుకునే వారికి ఈ ‘కెప్ట్ మెసేజ్’ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని చాట్‌లు డిసప్పియర్ సమయం ముగిసినా డిలీట్ కావు. అయితే, ఈ మెసేజ్‌లపై గ్రూపు సభ్యులందరికీ నియంత్రణ ఉంటుంది. ఎవరైనా, ఎప్పుడైనా వీటిని డిలీట్ చేయవచ్చు. చాట్‌ ఇన్‌ఫోలో ‘కెప్టె మెసేజెస్’ కనిపిస్తుంది. ఇందులో ఎవరైనా డిసప్పియరింగ్‌ మెసేజ్‌ను ఉంచినప్పుడు, గడువు ముగిసినా ఆ మెసేజ్ డిలీట్ కాదు. భవిష్యత్తులో ఈ సందేశాలను చూడాలనుకున్నప్పుడు ‘కెప్ట్ మెసేజెస్’ ఫీచర్ ఉపయోగపడుతుంది.

స్టార్డ్ మెసేజెస్’ అవుట్

ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. డిసప్పియరింగ్ చాట్‌లలో మెసేజ్‌లను స్టార్డ్ మెసేజ్‌లుగా సెలక్ట్ చేసే ఆప్షన్‌ను వాట్సాప్ నిలిపివేస్తుంది. కెప్టె మెసేజెస్ ఫీచర్ వస్తే ఇక దానితో పని ఉండదు కాబట్టి ‘స్టార్డ్ మెసేజెస్’ ఫీచర్‌ను తొలగిస్తుంది. ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులో ఉందో, లేదో తెలుసుకునేందుకు గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేసి గ్రూప్ నేమ్‌పై ట్యాప్ చేస్తే ‘కెప్ట్ మై మెసేజెస్’ సెక్షన్ కనిపిస్తుంది. అక్కడ గ్రూప్ సభ్యులు సేవ్ చేసిన మెసేజ్‌లు ఎవరూ డిలీట్ చేయనంత వరకు కనిపిస్తాయి.

ప్రస్తుతం ఎవరికి?

కెప్ట్ మెసేజెస్ సెక్షన్ ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే వాట్సాప్ బిజినెస్ లేటెస్ట్ వెర్షన్ (v2.23.4.10)కు అప్‌గ్రేడ్ అయిన వారికే ఈ ఫీచర్ ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. త్వరలోనే కొత్త యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. కాబట్టి ఈ ఫీచర్ కనిపించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది.ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్టు వాట్సాప్ ఇటీవల హింట్ ఇచ్చింది. పెద్ద ఆడియో మెసేజ్‌లను ఇది టెక్స్ట్ మెసేజ్‌గా కన్వర్ట్ చేస్తుంది. అలాగే స్టేటస్‌లో ఎమోజీ రియాక్షన్ ఫీచర్, ప్రైవేట్ ఆడియన్స వంటి ఫీచర్లను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది.

Leave A Reply

Your email address will not be published.