బ్రహ్మకుమారి ధ్యానకేంద్రంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్స్ వాడ ప్రతినిధి: బాన్స్ వాడ పట్టణంలోని ఓం శాంతి బ్రహ్మకుమారి ధ్యాన కేంద్రంలో బుధవారం మహా శివరాత్రి సందర్బంగా మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా బ్రహాకుమారిస్ ఆశ్రమ జిల్లా కేంద్ర సమన్వయ సభ్యులు గంగా బహన్ మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్బంగా నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా బ్రమ్మకుమారి ధ్యాన కేంద్రాలలో మహా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.మహా శివరాత్రి రోజు శివపరమాత్మ ఉద్బవించిన రోజని ధ్యానంలో కూర్చున్న ప్రతీ ఒక్కరూ తన మస్తిష్కములో శివపరమాత్మ రూపంలో జ్యోతి దర్శనం చేసుకోవాలన్నారు.ధ్యానంతో మనసు స్వచ్ఛమవుతుందని మనం సద్గుణ సంపన్నులమవుతామన్నారు.ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే ప్రతీ రోజు మెడిటేషన్ ద్వారా మనశాంతి పొంది మనిషి లోని దుర్గుణాలను వదలి సద్గుణ సంపన్నులవుతారని అన్నారు. మహా శివరాత్రి పర్వధినాన్ని పురస్కరించుకొని శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ధ్యాన కేంద్రంలో శివపరమాత్మ జెండాను ఇన్వెస్టిగేషన్ అధికారి రాజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మకుమారి ధ్యాన కేంద్రాలలో స్వచ్చందంగా మెడిటేషన్ చేయిస్తారని ప్రతీ ఒక్కరూ మానసిక ఉత్సాహాన్ని ధ్యానం ద్వారా పొందాలని ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించే బ్రమ్మ కుమారిల సేవలుఅభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ధ్యాన కేంద్ర మహిళలు, ధ్యానకేంద్ర నిర్వాహకులు సంధ్య భహన్, చంద్రకళ, సభ్యులు రాకేష్, మనోహర్, కేశవ్,పట్టణ ధ్యానకేంద్ర సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.