కాషాయ జెండా పట్టేవాళ్లే నిజమైన హిందువులు

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ - ముస్తాబాద్ మండలం గూడెంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మీరు ఏ పార్టీ జెండా అయినా పట్టుకోండి… ఇబ్బంది లేదు. కానీ కాషాయ జెండా నీడలో పనిచేసేటోడే నిజమైన హిందువు. వాళ్లనే హిందూ సమాజం గుర్తిస్తుంది. ఓట్ల కోసం డ్రామాలు చేసేటోళ్లను చీత్కరించండి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలంలోని గూడెంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బండి సంజయ్ కుమార్. జిల్లా ఇంఛార్జీ మోహన్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాస్ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…

• శివాజీ చరిత్ర అందరూ తెలుసుకోవాలి. ఊరూరా శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియాలో శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలో హిందుత్వ వాతావరణం వచ్చేసింది.

• శివాజీ మహారాజ్ హిందూ ధర్మం కోసం, హిందూ సమాజ సంఘటన కోసం పనిచేసిన దేవుడు శివాజీ. నాకెందుకులే అనుకుంటే హిందుత్వం ఉండేది కాదు. శివరాత్రి పర్వదినం, శివాజీ పండుగకు సంబంధం ఉంది.

• మొగల్స్ శివలింగం మీద మూత్రం పోస్తే ఆనాడు చిన్న వయసులోనే ఉన్న శివాజీ రగిలిపోయిండు. పెద్దయ్యాక యుద్దం చేసి తరిమి తరిమికొట్టిండు. ఈరోజు మొగల్స్ ఉంటే… ఈరోజు మజ్లిస్ వంటి మత చాందస పార్టీలొచ్చినయ్.

• మీరు ఏ కండువా, జెండా పట్టుకోండి… నాకైతే ఇబ్బంది లేదు. కానీ కాషాయ జెండా నీడలో పనిచేస్తేనే హిందూ సమాజం గుర్తిస్తుంది. ఓట్ల కోసం డ్రామాలు చేస్తే హిందూ సమాజం చీత్కరిస్తుంది. అయ్యప్పను, సరస్వతి అమ్మవార్లను కించపరిస్తే మాట్లాడకపోవడం బాధాకరం. మనకు కష్టాలొస్తే దేవుళ్లు గుర్తొస్తారు…. దేవుళ్లను కించపరిస్తే స్పందించకపోవడం అన్యాయం. హిందూ ద్రోహులుగా మిగిలిపోతాం. ఇకపై ఊరుకోవద్దు. హిందూ ధర్మాన్ని కించపరిస్తే తరిమి తరిమి కొడదాం.

• వందేళ్లు బతకడం కంటే.. బతికినన్నాళ్లు దేశం కోసం, ధర్మం కోసం పనిచేద్దాం. ఏ లక్ష్యం కోసం శివాజీ యుద్దం చేశారో ఆయన ఆశయాలను సాధించుకుందాం. ధర్మ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ క్రుషి చేయాలి. ధర్మ కార్యం చేస్తే ప్రజల్లో నిలిచిపోతాం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.