రజాకార్ల పాలనను తరిమికొడతా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రామరాజ్యాన్ని స్థాపించేదాకా విశ్రమించబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రతిజ్ఝ చేశారు. ఊరూరా శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడమే కాకుండా శివ లింగంపై మూత్రం పోసిన మొగల్స్ ను తరిమికొట్టిన యోధుడు శివాజీ అన్నారు.

తెలంగాణలో రజాకార్ల పాలనను తరిమికొట్టి రామ రాజ్యాన్ని స్థాపించేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రతిన బూనారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పనిచేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఊరూరా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట వెంకటాపూర్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జై శివాజీ..జైజై ఛత్రపతి అంటూ యువత పెద్ద ఎత్తున నినదించారు. మరోవైపు బండి సంజయ్ పై పూల వర్షం కురిపిస్తూ వెంకటాపూర్ గ్రామస్తులు స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడారు. ముఖ్యాంశాలు…

• హిందూ ధర్మ కోసం పనిచేయడమే నాకు ముఖ్యం. రాజకీయాల కోసం ధర్మాన్ని ఉపయోగించబోను. ధర్మం కోసం రాజకీయాలు చేస్తాను.

• ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ స్థాపన కోసం నిరంతరం పనిచేసిన యోధుడు. చిన్న పిల్లాడి వయసులో ఉండగా శివలింగంపై మూత్రం పోసిన మొగల్స్ పై రగిలిపోయాడు. పెద్దయ్యాక మెగల్స్ పై యుద్దం చేసి తరిమి తరిమి కొట్టిన వీరుడు శివాజీ.

• హిందూ మతం ఏ మతానికి వ్యతిరేకం కాదు. అయినా హిందూ ధర్మాన్ని కించపర్చడం కొంతమందికి ఫ్యాషన్ గా మారింది. కొందరు ఫాల్తుగాళ్లు హిందూ మతాన్ని కించపరిస్తే స్పందించకపోవడం అన్యాయం. అయ్యప్పను, సరస్వతి అమ్మవార్లను కించపరిస్తే కనీసం నిరసన వ్యక్తం చేయకపోవడం బాధాకరం. ఇది కరెక్ట్ కాదు..

• శివాజీ స్పూర్తిగా హిందూ సమాజం సంఘటితం చేసే దిశగా పనిచేయాలి. ఊరూరా శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో హిందు ధర్మాన్ని హేళన చేసే ప్రమాదముంది. టైం పాస్ పాలిటిక్స్ చేయొద్దని కోరుతున్నా. బతికినన్నాళ్లు హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేయండి. మనం చనిపోయినాక కూడా సమాజం గుర్తించేలా ధర్మ కార్యం చేసినోళ్లే నిజమైన హిందువు.

• మీరు కష్టపడి ఎంపీగా నన్ను గెలిపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినయ్యా. తెలంగాణలో రజాకార్ల రాజ్యాన్ని పొలిమేరలదాకా తరిమికొట్టి మీరు కలలు కన్న రామరాజ్యాన్ని స్థాపించేదాకా విశ్రమించబోనని ప్రతిజ్ఝ చేస్తున్నా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.