ఏపీలో ప్రతి వేయి మంది అబ్బాయిలకు 934 మంది అమ్మాయిలు

-     తెలంగాణలో  ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 919 అమ్మాయిలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు అమ్మాయిలు 953 మంది మాత్రమే ఉన్నారు. ఈ మేరకు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో వివరాలు నమోదయ్యాయి. సంవత్సరాలవారీగా చూస్తే.. 2016–17లో ప్రతి వేయి మంది అబ్బాయిలకు అమ్మాయిలు 946 మంది ఉన్నారు. ఇక 2022–23 నాటికి ప్రతి వేయి మంది అబ్బాయిలకు అమ్మాయిలు 953 మంది ఉన్నారు.2016–17 నుంచి చూస్తే ఈ ఆరేళ్లలో అమ్మాయిల జననాల నిష్పత్తి మాత్రమే పెరగడం గమనార్హం. కాగా ప్రతి వేయి మంది అబ్బాయిలకు అత్యధికంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 994 మంది అమ్మాయిలు ఉన్నారు.పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత గుంటూరు జిల్లాలో 986 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 970 మంది చొప్పున అమ్మాయిలు ఉన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 965 మంది అమ్మాయిలు ఉన్నారు.2016–17తో పోలిస్తే… 2022–23 నాటికి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి ప్రకాశం వైఎస్సార్ జిల్లాల్లో అమ్మాయిల శాతం పడిపోయింది. కాగా ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో పుట్టే ప్రతి శిశు జననం అధికారిక వెబ్సైట్లో నమోదవుతున్న సంగతి తెలసిందే.మరోవైపు జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధ్యయనం–4 (2015–16) ప్రకారం… దేశంలో ప్రతి వేయిమంది అబ్బాయిలకు 919 అమ్మాయిలు ఉన్నారు. అలాగే 2019–20 (అధ్యయనం–5) ప్రకారం.. 929 మంది అమ్మాయిలు ఉన్నారు.ఇక 2015–16లో ఆంధ్రపదేశ్లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 914 మంది అమ్మాయిలు ఉన్నారు. అదేవిధంగా 2019–20 లెక్కల ప్రకారం ఏపీలో ప్రతి వేయి మంది అబ్బాయిలకు 934 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ సంవత్సరాల్లోనే తెలంగాణలో  ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు వరుసగా 919 929 మంది చొప్పున అమ్మాయిలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.