తప్పుడు పత్రాలు సృష్టించి భూమి లాక్కున్న టీఆర్ఎస్ నాయకులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: న్యాయం కోసం ఓ అన్నదాత నగర బాట పట్టాడు. సమస్యను బ్యానర్‌ పై రాసుకొని నగరంలో ప్రదర్శించాడు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ నుంచి నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా ఊరి తాడు చేతపట్టుకొని డీజీపీ కార్యాలయం  వరకు బాధిత రైతు గట్ల సురేందర్ నడుచుకుంటూ వచ్చాడు. వరంగల్ జిల్లా పోనకల్ గ్రామానికి చెందిన సురేందర్ భూమిని స్థానిక టీఆర్ఎస్ నాయకులు తప్పుడు పత్రాలు సృష్టించి అతని తమ్ముడికి రాయించారని ఆరోపించాడు. స్థానిక పోలీసులను ఆశ్రయించిన తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వారు సృష్టించినవి సరైన పత్రాలు అయితే తనను హైదరాబాద్ నడిబొడ్డున ఊరి తీయాలని బాధిత రైతు అభ్యర్థించాడు. ఈ విషయంలో గవర్నర్ హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర డీజీపీలు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాడు.

Leave A Reply

Your email address will not be published.