కల్లుసీసాలో ఎలుక..లైట్ తీసుకోమన్న బట్టి నిర్వాహకుడు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్ నగరంలోని 1వ డివిజన్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కాలుర్ లో కల్లు సేవించేందుకు వచ్చిన అంబేద్కర్ కాలనికి చెందిన యువకులకు షాక్ తగిలింది. శనివారం కృత్రిమ కల్లు సిసాల 12 (బాక్సును) కోనుగోలు చేసి అందులో ఒక యువకుడు కల్లు తాగేందుకు చూశాడు. సిసాలో చచ్చిన ఎలుకను చూసి హతాశయుడయ్యాడు. మరొక యువకుడు తీసుకున్న కల్లు సిసాలో బోద్ధింక కనిపించింది. ఈ సంఘటన నేపథ్యంలో కల్లు ప్రియులకు కృత్రిమ కల్లు తయారి దారులు ఏమి కలిపి మత్తు కల్లును తయారు చేస్తున్నారని కల్లు బట్టి నిర్వహకుడిని ప్రశ్నిస్తే ఎలుకనే వచ్చింది కదా, ఏం కాదులే అంటూ సదరు బట్టి నిర్వాహకుడు సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగారు. ఇలా రోజు తాను కల్లు సేవించే వాళ్ళమని, ఇలాంటి కల్లు తాగి ప్రజలు ఆరోగ్య పాలవుతారని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి కృత్రిమ కల్లు తయారి దారులపై చర్యలు తీసుకుంటారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

నిజామాబాద్ నగరంలో ఈనెల 8న కృత్రిమకల్లు కాటుకు ఒకరు బలి అయ్యారు. నగరంలోని చంద్రానగర్ కల్లుబట్టిలో కోటగల్లికి చెందిన బండిసాయికుమార్ (40) అనే వ్యక్తి కల్లు తాగి అక్కడే మృతి చెందాడు. నగరంలోని ఖలీల్ వాడిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేసే సాయికుమార్ నిత్యం విధి నిర్వహణ తర్వాత కల్లు సేవించే అలవాటు ఉంది. బుధవారం రాత్రి సైతం చంద్రనగర్ కల్లుబట్టిలో కల్లు సేవించి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలిస్ లు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. అబ్కారి శాఖాధికారులు అది కుడా చేయ్యలేదు. ఎమిటంటే మాకు పిర్యాదు రాలేదని చెబుతున్నారు. మరి అక్కడ వ్యక్తి చనిపోయాడు కనీసం షాంపిళ్లను సేకరించారా అంటే లోకల్ ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ లో మామూళ్ల పంచాయతీలో అధికారులు సెలువులపై పోయారు అంటున్నారు. ఇంచార్జీలకు అడిగితే మాకు తెలియదు అంటున్నారు. ఒక వేళ షాంపిళ్లు సెకరించిన కృత్రిమకల్లు తయారికి వాడే అల్పజోలుం మత్తు పదార్థాలను గుర్తించే పరికరాలు లేవంటా అని చెబతున్నారు. ఒక వేళ ఉన్న ల్యాబ్ రిపోర్టు వచ్చేవరకు పుణ్యకాలం కాస్త ముగుస్తుంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 305 కల్లు సోసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీల ద్వారా కృత్రిమ కల్లును తయారు చేస్తూ బట్టీలకు తరలించి అమ్మకాలు చేస్తారు. జిల్లాలో తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే కల్లును గీత కార్మీకులు కల్లును అమ్మేవారు. చెట్లు (రేషన్) లేకపోవడం, మత్తు కల్లులో గీతపనివారలు కాకుండా వ్యాపారులు ప్రవేశించడంతో పేరుకు సోసైటి ఐనా పెత్తనం వ్యాపారులది కావడంతో కృత్రిమ కల్లును తయారు చేసి బట్టిల్లో విక్రయిస్తున్నారు. ఆల్ఫాజోలోం, డైజోఫాం, క్లోరోహైడ్రెట్ వంటి రసాయనాలు కలిపి కల్లును కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం అని తెలిసినా కల్లు వ్యాపారులు వీటినే వాడుతూ కృత్రిమ కల్లును తయారు చేస్తున్నారు. తక్కువ ధరకు దొరుకుతుందని పేదలు ముఖ్యంగా కూలీలు, హమాలీలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు కల్లును సేవిస్తారు. అయితే చెట్లకల్లుకు బదులు కృత్రిమ కల్లు తయారు చేసి అమ్మటంతో చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో కృత్రిమ కల్లు కల్తీకల్లు సేవించి అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. మరి కొంత మంది తమ ప్రాణాలు కోల్పోయారు. కృత్రిమ కల్లు ఉత్పత్తికి నిజామాబాద్ జిల్లా కేంద్రం రాజాదాని అని చెప్పాలి. ఒక్క నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్డులో ఉన్న 1,2 డిపోల పరిధిలో 40 కల్లు బట్టీలు ఉన్నాయి. అందులో నిత్యం లక్షలీటర్ల కృత్రిమ ( మత్తు పదార్థాలతో తయారు) చేసిన కల్లువిక్రయాలతో నగరంలో నిత్యం రూ.20 నుంచి 30 లక్షల ఆదాయం డిపోలకు వస్తుంది. నిజామాబాద్ రూరల్ మండలంలో ఒక కల్లు వ్యాపారీ, మోపాల్ మండలంలో ఒక జడ్పీటీసీ (10 బాగస్వామిగా నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పూర్వపు నిజామాబాద్ మండలం మొత్తం కృత్రిమ కల్లు ఏరులై పారుతూన్న ఎక్సెజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.