ఏఎస్అర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో విజయస్పూర్తి కార్యక్రమం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ మండలంలోని కొత్తబాద్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విజయస్ఫూర్తి కార్యక్రమం ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వ్యక్తిత్వ వికాస నిపుణులు, మోటివేటర్, వక్త గాలి నరేందర్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న వేళ, ఎలాంటి భయా ఆందోళనలు లేకుండా ఆనందంగా ఉత్సాహంగా చదవాలని, చదివింది, ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే విషయాలను అర్థం చేసుకోని ఎల్లప్పుడు గుర్తుండే విధంగా మెలకువలను వివరించి అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఈ అతి ముఖ్యమైన సమయంలో విద్యార్థులు సమయాన్ని ఏమాత్రం కూడా వృధా చేయకుండా ఎలా ఉపయోగించుకోవాలి ఇలాంటి పనులకు సమయానికి కేటాయించాలి, ఏ ఏ పనులను వదిలిపెట్టాలి అని అనేక విషయాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ASR ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అయ్యల సంతోష్, టీచర్స్  ధరాణి, సునీత, కవిత, రామ లక్ష్మీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.