వణికిస్తున్న విషజ్వరాలు

- చలి, దగ్గు, ఒళ్లు నొప్పులు, కళ్లు మండడం - రోజురోజుకూ పెరుగుతున్న కేసులు - కొన్ని ప్రాంతాల్లో ఇంటిల్లిపాదీ బాధితులే.. - కిటకిట లాడుతున్న ఆసుపత్రులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జ్వరాలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. చలి, దగ్గు, ఒళ్లు నొప్పులు, కళ్లు మండడం లాంటి లక్షణాలతో వణికి పోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, మాత్ర సీజనల్‌ శీతాకాలం నుంచి వేసవికాలానికి మారుతున్నాం.. వ్యాధులు మామూలే అని కొట్టి పారేస్తున్నారు. బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు తదితర జిల్లాలో వైరల్‌ ఫీవర్స్‌(Viral fevers) బాధితులు పెరిగిపోతున్నారు. జిల్లాల్లో వరుసగా జాతరలు, రాజకీయ నాయకుల సమావేశాల్లో జనం గుమిగూడుతుండంతో వ్యాధులు ప్రబలుతున్నట్లు ఆరోగ్యశాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. చాలా ఏరియాల్లో ఇంటిల్లిపాది బాధితులుగా ఉన్నారు. వ్యాధులతో ప్రైవైట్‌ ఆస్పత్రికి వెళ్లిన వారు అధిక బిల్లులు చెల్లించలేక విలవిలలాడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి కేసులు అధికంగా పెరుగుతున్నాయి. ఆస్పత్రులకు వెళ్లలేని వారు సొంతంగా మాత్రలు వేసుకుని కాలం గడుపుతున్నారు. కొందరు బాలింతలు, వృద్ధులు, చిన్నపిల్లలు అధికంగా వ్యాధులకు గురవుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అంతంతగానే అందుతోంది. మరికొన్ని చోట్ల అసలు వైద్యులే ఉండడం లేదు. దీనితో రోగులు ప్రాణభయంతో పట్టణాల్లో ఉండే పెద్దపెద్ద ఆసుపత్రులు, క్లీనిక్‌లపై ఆధార పడుతున్నారు. ఇదే మంచి కాలం అన్నట్లు కొందరు డాక్టర్లు రోగులతో డబ్బులు గుంజేందుకు అనవసర టెస్టుల పేరుతో ఫీజులు ఎక్కవ లాగుతున్నారు. కొందరు వైద్యులు మానవత్వంతో రోగులకు వైద్యం చేసి అండగా నిలుస్తున్నారు.

ప్రస్తుతం వైరల్‌ ఫివర్స్‌ వచ్చిండేది నిజమే, జాతర్లు, ఉత్సవాలు, ఎన్నికలు, ప్రచారాలు, లాంటి కార్యక్రమాలతో జనం పోగవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అయితే ప్రాణాపాయం లేదు, మూడు రోజలు జ్వరంతో పాటు నీరసంగా ఉంటుంది. తరువాత ఆరోగ్యం అదే కుదుట పడుతుంది.

Leave A Reply

Your email address will not be published.