షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు

- హైదరాబాద్ కు  తరలింపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: షర్మిలకు చట్టం అంటే లెక్కేలేనట్టుగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్లో ఆమె అరెస్టయ్యారు. అయితే.. పోలీసులకు సహకరించేందుకు ఆమె ఏమాత్రం ఇష్టపడలేదు. షర్మిల బస్సు లో ఉండటంతో షర్మిలను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు.చివరకు బస్సుని తరలిస్తామని పోలీసులు  సిబ్బందిని హెచ్చరించడంతో షర్మిల బస్సు తలుపులు తీసింది. దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ పోలీస్ వాహనంలో తరలించారు.ఇక గతంలో వరంగల్లోనూ.. ఇదే తరహా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆమెను నిలువ రించారు. దీంతో ఇదేదో తేల్చుకునేందుకు ఆమె స్వయంగా ప్రగతి భవన్కు కారులో వెళ్లడం.. అనంతరం.. కారులోనే ఆమె టోయింగ్ వాహనంతో పోలీసులు స్టేషన్కు తరలించడం తెలిసిందే. ఇది కూడా రాష్ట్రంలో అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్లో చట్టం అన్నా.. పోలీసులు అన్నా కూడా .. షర్మిలకు ఏమాత్రం లెక్కలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.ఇక కోర్టుల విషయానికి వస్తే.. పాదయాత్ర నిర్వహించుకోమని చెబుతున్న కోర్టులు.. ఎవరిపైనా పరుషంగా వ్యాఖ్యలు చేయొద్దని.. వ్యక్తిగత దూషలు వద్దని కూడా.. చెబుతోంది. పాదయాత్రలో నిర్ణీత సంఖ్యలోనే పార్టీ కార్యకర్తలను తీసుకువెళ్లాలని కూడా చెబుతోంది అయినప్పటికీ.. షర్మిల మాత్రం ఎక్కడికక్కడ వివాదాలకు.. విమర్శలకు.. సంచలన వ్యాఖ్యలకు కేంద్రంగా మారుతూ.. పాదయాత్ర అంటేనే విధ్వంసక యాత్ర మాదిరిగా మలిచేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.చట్టం… పోలీసులు.. కోర్టులు.. సమాజాన్ని శాంతి యుతంగా నడిపించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థలు. అశాంతి తలెత్తకుండా..  ప్రజలు ప్రశాంతంగా జీవించేలా ఏర్పాటు చేసిన వ్యవస్థలు కూడా! వీటిని దేశం లోని ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాలనేది రాజ్యాంగం చెబుతున్న మాట.అలా గౌరవిస్తేనే అతి పెద్ద ప్రజా స్వామ్య దేశంలో అందరూ మనగలుగుతారు. కానీ అదేం చిత్రమో.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురా లు వైఎస్ షర్మిలకు మాత్రం ఇవేవీ తన రాజ్యాంగంలో లేనట్టే వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.