తాలిబన్ల పై చర్చనీయాంశమైన తస్లీమా నస్రీన్ వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తాలిబన్ల మీద  బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి. పాకిస్థాన్ ఇపుడు ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకున్నా తాలిబన్ల వైఖరి చూసినా ఒకటి మాత్రం ఖాయమని అనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. అదేంటి అంటే ఏదో ఒక రోజు పాకిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆమె అంటున్నారు.తాజాగా పాకిస్థాన్ లో తెహ్రీకే తాలిబన్ ఆత్మాహుతి దాడి నేపథ్యంలో తస్లీమా నస్రీన్ ఇలా స్పందించారు.తాలిబన్లు ఇక లేరు. వారి ఊసే లేదు అని ప్రపంచాన్ని అగ్రదేశం నమ్మించిందో లేక ప్రపంచం మభ్యపడిందో తెలియదు కానీ దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేసి నాటో దళాలు పాలించిన కూడా అక్కడ ప్రజా  ప్రభుత్వాన్ని నిలబెట్టినా అమెరికా బలగాలు అలా తప్పుకోగానే ఇలా పేకమేడలా ప్రభుత్వం కూలింది. ఇక తాలిబన్లు క్షణాల మీద ఆఫ్ఘాన్ని ఆక్రమించుకున్నారు. తమదైన నియంత పాలన అక్కడ చేస్తున్నారు.ఇక తాలిబన్లు రెండు దశాబ్దాల పాటు పోరాటం చేస్తూ ఉనికిని చాటుకున్నారంటే వారికి చోటు ఇచ్చింది పాకిస్థాన్ అన్నది లోక విధితమే. పాక్ కి నాడు ఉన్న వ్యూహమేంటి అంటే ఆఫ్ఘాన్ లో తాలిబన్లు అడుగుపెడితే వారి నుంచి తమ వైపునకు ఆ దేశాన్ని తిప్పుకోవచ్చు. తామే దాన్ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు అని. కానీ జరిగింది వేరు. ఏకు మేకులా మారిన తాలిబన్లు ఇపుడు పాక్ కే పెను సవాల్ గా మారారు.పాకిస్థాన్ లో ఉగ్ర మూకలను ఎగదోస్తూ తాలిబన్ల ప్రోత్సాహా శక్తులు ఒక వైపు రెచ్చిపోతున్న వేళ పాకిస్థాన్ తన శక్తియుక్తులను కోల్పోతూ ఉండడమే విషాదం. ఆర్ధికంగా ఆ దేశం ఇపుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. అదే విధంగా చూస్తే రాజకీయంగా కూడా సమస్యలతో ఉంది. దేశంలో అన్ని విధాలుగా సమస్యలు ఉన్నాయి.కంగా కరాచీలోని పోలీసు కాంపౌండ్ లోకి పాకిస్థాన్ తెహ్రీకే తాలిబన్ కు చెందిన ఉగ్రమూక చొరబడగా ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. ఇందులో తెహ్రీకే తాలిబన్ కు చెందిన ఐదుగురు సాయుధ మిలిటెంట్లు కూడా ఉన్నారు. అంటే పాకిస్థాన్ మీద పాము పడగలా తాలిబన్లు ఉగ్ర మూకల కన్ను పడిందన్న మాట.దీని మీదనే తస్లీమా నస్రీన్ తన ట్విట్టర్ పేజీలో స్పందించారు. ఐఎస్ఐఎస్ అవసరం లేదు. పాకిస్థాన్ ను భయభ్రాంతులకు గురి చేయడానికి పాకిస్థాన్ ను భయపెట్టడానికి ఒక్క  తాలిబన్ చాలు. ఏదో ఒక రోజు తాలిబన్లు పాకిస్థాన్ ను తమ నియంత్రణలోకి తీసుకున్నా నేను ఆశ్చర్యపోను  అని ఆమె   అంటున్నారు. . పాకిస్థాన్ పరిస్థితి ఇలా దయనీయంగా ఉండడంతో మరింత సులువుగా తాలిబన్ల ప్రోత్సహక దళాలు ఆ దేశం మీద టార్గెట్ చేస్తాయా అన్న చర్చ ఉంది.
పాకిస్థాన్ సైనిక ఆధిపత్యంలో ఉన్న దేశం. పేరుకు పౌర ప్రభుత్వం అక్కడ ఉంటుంది. అంతా అక్కడ సైన్యమే నడుపుతుంది. ఆ సైన్యం కనుసన్నలోనే ఉగ్ర వాదాన్ని ప్రోత్సహించి భారత్ మీద దాడులు చేయిస్తున్నారు అన్న ప్రచారం ఉంది. పాక్ ఒక లెవెల్ ప్రమాదం అయితే రేపటి రోజున తస్లిమా నస్రీన్ చెప్పినట్లుగా పాక్ ని తాలిబన్లు మింగెస్తే డైరెక్ట్ గా పక్కలోనే ఉగ్ర భూతం భారత్ కి పొంచు ఉంటుందని అంటున్నారు. ఈ అంతర్జాతీయ పరిణామాల మీద భారత్ నిశిత పరిశీలన చేసి పాక్ విషయంలో ఏం చేయాలో కూడా ఒక కార్యాచరణతో కచ్చితమైన వ్యూహాలతో సిద్ధంగా ఉండాలసిన అవసరం ఉందని అంతర్జాతీయ దౌత్య  నిపుణులు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.