క్యాసినో వ్యవహారంలో బాన్సువాడకు సంబందాలు ?

- చీకోటి ప్రవీణ్‌తో పలువురికి దోస్తీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో క్యాసినో వ్యవహారంలో క్యాసినో వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం పాఠకులకు విధితమే. ఈ వ్యవహారంలో ఇప్పటికే క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కుమార్‌ పలు ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ఇదిలా ఉండగా బాన్సువాడలో సైతం క్యాసినో వ్యవహారంలో పలువురు వ్యాపార, రాజకీయ, ప్రముఖ వ్యక్తులు పాలుపంచుకున్నట్లు విశ్వాసనీయవర్గాల సమాచారం. ఈ విషయంలో సీబీఐ గాని ఈడీ గాని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడితే నిజా నిజాలు వెళ్ళడయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, నామినేటెడ్‌ పదవులు అనుభవించిన వ్యక్తులు ఈ వ్యవహారంలో ఉన్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.