ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరం

- నసురుల్లాబాద్ భాజపా నాయకులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్ ప్రతినిధి:  నిన్న కంటోన్మెంట్ ఏమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరం ఐదు సార్లు ఏమ్మెల్యే గా పనిచేసిన సాయన్న అవమానిచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి చేయకపోవడం యావత్తు దళిత సమాజం మరియు తెలంగాణ సమాజానికి అవమానించడమేనని నసురుల్లాబాద్ మండల భాజపా నాయకులు ఎద్దేవా చేసారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత దళిత సమాజాన్ని మొట్టమొదటగా తెలంగాణ సీఎం చేస్తామని చెప్పి మాట మార్చారు మూడెకరాల భూమి, దళిత బంధు డిప్యూటీ సీఎం రాజయ్యను, కడియం శ్రీహరి, అవమానించడం తెలంగాణ రాష్ట్రంలో దళితుల అసైన్మెంట్ భూములను గుంజుకోవడం,నేరెళ్ల దళితులను చిత్రహింసలు పెట్టడం భూదాన్ పోచంపల్లి భూములు గుంజుకోవడం ఇలా ప్రతి విషయంలో దళిత సమాజాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తరువాత అవమానిస్తూనే ఉంది విషయంలో దావత్ తెలంగాణ లలిత సమాజం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణ విషయంలో చేసిన తప్పిదాన్ని సీఎం కేసీఆర్ గారు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం దీని విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు మరియు దళిత ఎమ్మెల్యేలు స్పందించాలి మీరందరూ కూడా దళిత ద్రోహులుగా మిగిలిపోతారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నాయకులు కేసీఆర్ కుటుంబానికి బానిసగా పని చేస్తున్నారని తెలంగాణ సమాజం భావిస్తుంది ఈ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు, మండల ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్, ఓబీసీ జిల్లా నాయకుడు వడ్ల సతీష్, కూనిటీ రామ్, సాయి కుమార్, పేరక రాములు, దేవిసింగ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.