మెట్ట భూములను మెరుగు పరచాలి

- ప్రస్తుత పరిస్థితులలో ఇది అత్యంత ఆవశ్యకం - ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 50 శాతం మెట్ట భూముల నుండే - భూమిపై ఉండే నేలలలో 40 శాతం మెట్ట భూములు - ఇవి ఉష్ణ,  సమశీతోష్ణ మండలాలలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి - రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మారుతున్న వాతారవరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఆహార భద్రత, జీవవైవిధ్యం, సన్న, చిన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మెట్టభూముల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మెట్టభూముల మెరుగు పరిచే అంశంపై ఇక్రిశాట్ లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఈ పరిస్థితులలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు మెట్టభూముల పరిస్థితిని మెరుగుపరిచి సుస్థిర వ్యవసాయానికి దారులు వేయాలని పిలుపు నిచారు.అందులో భాగంగా జరిగే పరిశోధన ఫలితాలు దీర్ఘకాలం పాటు వాతావరణ పరిస్థితులను మారుస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులను సంరక్షించాలిపర్యావరణ పరిరక్షణకు, పోషక భద్రతకు, పేదల ఆకలి తీర్చడానికి మెట్టభూములపై పరిశోధనలు చేస్తున్న ఇక్రిశాట్ సేవలు అభినందనీయమన్నారు.
గత 50 ఏళ్లుగా ఇక్రిశాట్ సేవలు ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఎందరికో మేలు చేయడం గర్వకారణమన్నారు.రాబోయే కాలంలో మెట్టభూములు మెరుగు పరిచేందుకు నూతన సాంకేతికతను  సృష్టించేందుకు ఈ సదస్సు తోడ్పడుతుందని ఆశిస్తున్నానన్నారు.
తెలంగాణలో మెట్ట భూములు మెరుగు పరిచే అంశం మీద సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు.ఈ సదస్సులో వచ్చే ఫలితాలు జీవ వైవిధ్యానికి ఉన్న ముప్పును, తగ్గుతున్న నేల ఆరోగ్యం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, కుచించుకు పోతున్న వ్యవసాయ ఉత్పాదతకు సరైన సమాధానాలు రాబడతాయని భావిస్తున్నారు.
పరిశోధనలన్నీ నేలలో ఉండే కర్భన శాతాన్ని, నేల జీవ వైవిధ్యాన్ని మెరుగు పరుస్తాయని నమ్ముతున్నానన్నారు.జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కలిసి పరస్పర సహకారంతో ఈ దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందని,మెట్ట భూముల సమస్యలపై ప్రాంతాల వారీగా నిర్ధిష్ట పరిశోధనా ఫలితాలను విడుదల చేయాలన్నారు.ఈ, కార్యక్రమంలో నీతి అయోగ్ సభ్యులు రమేష్ చంద్,   ఇక్రిశాట్ డీజీ డాక్టర్ జాక్వెలిన్ హ్యూగ్స్, ఇక్రిశాట్ డీడీజీ డాక్టర్ అరవింద్ కుమార్ మరియు వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.