గవర్నర్ కాళ్ళు మొక్కిన వైఎస్ జగన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దంపతులకు గన్నవరం విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. గవర్నర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీఎం జగన్ గవర్నర్‌కు వీడ్కోలు పలుకుతూ ఆయన కాళ్లకు మొక్కారు. వీడ్కోలు కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ జాషువా, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హరిచందన్ ఛత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం హరిచందన్‌కు విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్‌ గవర్నర్‌ను ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నాళ్లు సేవలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు సీఎం. ఆత్మీయుడు, పెద్దమనిషిగా, గవర్నర్‌ వ్యవస్ధకు ఒక నిండుతనం తీసుకొచ్చారని కొనియాడారు. తండ్రిలా, పెద్దలా ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సంపూర్ణంగా సహకరించారన్నారు. అలాగే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గవర్నర్ ప్రశంసించారు. బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయ్యారు.. ఆయన ఏపీ గవర్నర్‌గా మూడున్నరేళ్ల పాటు ఏపీ గవర్నర్‌గా కొనసాగారు.

Leave A Reply

Your email address will not be published.