వంద మంది మోదీ, షాలు వచ్చినా..

- 2024 ఎన్నికలపై ఖర్గే కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ‘2024 సార్వత్రిక ఎన్నికల్లో   కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వస్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరి పోరు చేయట్లేదు. ఇందుకోసం మా పార్టీ ఇతర పార్టీలతో చర్చలు జరుపుతోంది. ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుంటే దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేకుండా పోతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యం. విపక్ష కూటమికి కాంగ్రెస్ పార్టీ  నేతృత్వం వహిస్తుంది. మోదీ, అమిత్‌షా వంటి వారు వంద మంది వచ్చినా కాంగ్రెస్‌ గెలుపును అడ్డుకోలేరు’  అని మల్లికార్జున ఖర్గే అన్నారు.‘‘దేశాన్ని ఎదుర్కొనే ఏకైక వ్యక్తిని నేనే.. ఇతర వ్యక్తులెవరూ నన్ను తాకలేరు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేపదే చెప్పుకుంటున్నారు. ప్రజాస్వామ్యవాది ఎవరూ అలా మాట్లాడరు. మోదీజీ.. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారని గుర్తించుకోండి. మీరు నియంత కాదు. ప్రజలచేత ఎన్నుకోబడిన వారు. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారు’ అని నాగాలాండ్‌ లో జరిగిన ఎన్నికల ర్యాలీ లో మాట్లాడుతూ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.