పోలీస్‌ శాఖ మొత్తం ఇమేజ్‌  స్టేషన్లలోని రిసెప్షన్‌ ఆఫీసర్‌ పై ఆధారపడి ఉంటుంది

-   డీజీపీ అంజనీ కుమార్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పోలీస్‌ శాఖ మొత్తం ఇమేజ్‌ పోలీస్‌ స్టేషన్లలోని రిసెప్షన్‌ ఆఫీసర్‌ పై ఆధారపడి ఉన్నందున, పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చే పిటీషనర్ల సమస్యలను ఓపికతో విని వారికి తగు న్యాయం లభింస్తుందన్ననమ్మకాన్ని రిసెప్షన్‌ ఆఫీసర్‌ లు కల్పించాలని డీజీపీ అంజనీ కుమార్‌ అన్నారు. రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లలో రిసెప్షన్‌ ఆఫీసర్‌ స్టాఫ్‌ ఫంక్షనల్‌ వర్టికల్స్‌ పై నేడు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని 736 మంది రిసెప్షన్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డీజీపీ కార్యాలయం నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్‌ లో సీఐడీ అడిషనల్‌ డీజీ మహేష్‌ భగవత్‌,అడిషనల్‌ ఎస్‌.పి సత్యనారాయణ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఏకరూప పోలీస్‌ సేవలు అందించడం ద్వారా, ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్‌ అందించడం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయనే ఉద్దేశ్యంతో మొత్తం 17 ఫంక్షనల్‌ వర్టికల్స్‌ ప్రవేశ పెట్టమని తెలిపారు. ఈ 17 వర్టికల్స్‌ లో మొట్ట మొదటిదైన రిసెప్షన్‌ ఆఫీసర్‌ వర్టికల్‌ అత్యంత కీలకమని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.