మళ్లీ అసెంబ్లీకి రాను, మాట్లాడను

- యడియూరప్ప ఫేర్‌వెల్ స్పీచ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దశాబ్దాలుగా కర్ణాటక అసెంబ్లీ సభ్యుడిగా, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా, బీజేపీ స్ట్రాంగ్‌మన్‌గా పేరు తెచ్చుకున్న బీఎస్ యడియూరప్పు బుధవారంనాడు అసెంబ్లీలో ‘ఫేర్‌వెల్’ ప్రసంగం చేశారు. తన చివరి శ్వాస వరకూ పార్టీ పటిష్టత కోసం, పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు నిజాయితీగా పనిచేస్తానని తెలిపారు. 79 ఏళ్ల యడియరూప్ప ఎన్నికల్లో పోటీ నుంచి రిటైర్ అవుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. పోటీ నుంచి తాను రిటైర్ అయినప్పటికీ ఇంట్లో కూర్చునేది లేదని, అసెంబ్లీ సమావేశాల తర్వాత తాను రాష్ట్రంలో పర్యటించి పార్టీ తరఫున పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం సాగిస్తానని అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన చెప్పారు.రాష్ట్ర బడ్జెట్‌పై సభలో చర్చ జరుగుతుండగా యడియూరప్ప మధ్యలో కలగజేసుకుంటూ, ఇదే బహుశా అసెంబ్లీ తన చివరి ప్రసంగమని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు దృఢ సంకల్పంతో ప్రజల ముందుకు వెళ్లి, ఓట్లు అడగాలని సూచించారు. బీజేపీ స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.”ఈ ఎన్నికల తర్వాత ఐదేళ్లకు వచ్చే ఎన్నికల్లో కూడా భగవంతుడు నాకు శక్తినిస్తే బీజేపీని గెలిపించేందుకు నా శక్తియుక్తులన్నీ ధారపోస్తాను. నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పిన విషయం మీకందరికీ (సభ్యులు) తెలుసు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నాకు ఇచ్చిన గౌరవం, పొజిషన్ జీవితాంతం మరిచిపోను. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు తుదిశ్వాస వరకూ పోరాటం చేస్తాననడంలో ఎంతమాత్రం సందేహం లేదు. బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా నేను ఒకటే చెప్పదలచుకున్నాను. పట్టుదలగా ఎన్నికలకు సిద్ధం కండి. అవతలి వైపు వాళ్లు (విపక్షాలు) కూడా మనతో కలిసి వస్తారు. మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటే, వారిని కూడా కలుపుకొని బీజేపీని తిరిగి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి తీసుకువద్దాం” అని అన్నారు. ఒకరకంగా ఇది తన ఫేర్‌వెల్ అని, దీని తర్వాత అసెంబ్లీకి రావడం కానీ, మాట్లాడటం కానీ ఉండదని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.