వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులు ఎవరో తేల్చేసిన సీబీఐ !

* అవినాష్‌రెడ్డికి హత్య గురించి ముందే తెలుసు * ఘటనాస్థలిలో సాక్ష్యాలను చెరిపివేయడంలో కూడా అవినాష్‌రెడ్డి పాత్ర * హత్య కేసులో నిందితులు సునీల్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి.. * సహజంగా మరణించారంటూ డ్రామా క్రియేట్ *కుట్రపూరితంగా గుండెపోటు కథనాన్ని అల్లారని కౌంటర్‌లో పేర్కొన్న సీబీఐ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుపై హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ” వివేకా హత్య రోజు నిందితులందరూ భాస్కర్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. వివేకా మృతి సమాచారం కృష్ణారెడ్డి ద్వారా రాకముందే అవినాష్‌రెడ్డికి హత్య గురించి ముందే తెలుసు. ఘటనాస్థలిలో సాక్ష్యాలను చెరిపివేయడంలో కూడా అవినాష్‌రెడ్డి పాత్ర ఉంది. ఈ హత్య కేసులో నిందితులు సునీల్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి.. ఉదయం 5:20 నిమిషాలకు భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నారు. వీరి ముగ్గురి ప్రమేయం బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు’’ అని పేర్కొంది.ఇక నిందితుడు శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొంది. వివేక మృతి విషయాన్ని తెలుసుకొని అవినాష్‌రెడ్డితో పాటు శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, రమణారెడ్డి పీఏ, రాఘవరెడ్డి పీఏ ఘటనా స్థలానికి చేరుకున్నారని, బెడ్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న వివేకాను చూసి గుండెపోటుతో మరణించారని స్థానిక నేత శశికళకు సమాచారమిచ్చారని సీబీఐ వెల్లడించింది. ఆ తర్వాత అవినాష్‌రెడ్డి తన సెల్‌ఫోన్ నుంచి రెండు నెంబర్లకు కాల్ చేసి వివేకా మృతిపై సమాచారం అందించారని సీబీఐ తెలిపింది.దీనికోసం పీఏ రాఘవరెడ్డి ఫోన్‌ కూడా ఉపయోగించినట్లు గుర్తించారు. వివేకాపై భారీగా రక్తపు మరకలు, గాయాలు స్పష్టంగా చూసినప్పటికీ ఘటనాస్థలానికి త్వరగా రావాలని సీఐని అవినాష్‌రెడ్డి కోరలేదు. వివేకా గుండెపోటు, తీవ్ర రక్తపు వాంతులు కావడంతోనే సహజంగా మరణించారంటూ డ్రామా క్రియేట్ చేశారు. వివేకా హత్య రూపకల్పనను కావాలనే అవినాష్‌రెడ్డి దాచిపెట్టినట్లు గుర్తించాం. కుట్రపూరితంగా గుండెపోటు కథనాన్ని అల్లారని కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.