కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి

- ముక్త కంఠం తో నినదించిన నేతలు  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని పలువురు ప్రజా సంఘాలు, సంస్థల నేతలు  ముక్త కంఠం తో డిమాండ్ చేసారు. నోట్ల పై భారత రత్న  అంబేద్కర్ ఫోటో ముద్రణ సాధన సమితి ఆద్వర్యం లో గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రజా పోరు రధయాత్ర 23 వ రోజు సందర్భం గా ఉస్మానియా యూనివర్శిటీ లా కాలేజి ఆవరణ లో అంబేద్కర్ ఫోటో ముద్రణ సాధన సమితి నేషనల్ అడ్వైసర్ ఆళ్ళ రామకృష్ణ  ఆద్వర్యం లో బహిరంగసభ జరిగింది . ఈ సభలో పార్లమెంట్ సబ్యులు ఆర్. కృష్ణయ్య, జేబి.రాజు,ప్రొఫెసర్ గలివినోడ్ కుమార్, ఆళ్ళ రామకృష్ణ ,జెర్రి పోతుల రామకృష్ణ, తదితరులు ప్రసంగించారు.ఈ సందర్బంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ 1949లో బ్యాంకులను జాతీయం చేసింది డా. బి.ఆర్. అంబేద్కర్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకువచ్చిందని  డా. బి.ఆర్.అంబేద్కర్. అయితే, గాంధీకి వంద సంవత్సరాలు పూర్తయ్యాయని చెప్పి 1969లో 5 రూపాయల మీద, 10 రూపాయల మీద ముద్రించడం ప్రారంభించారు. ఇప్పుడు కరెన్సీ అంటే గాంధీ తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు. దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ, డా. వి. ఆర్. అంబేద్కర్ గారికి 130 సంవత్సరాలు పూర్తయినా ఆర్బిఐ డా. బి. ఆర్. అంబేద్కర్ గారి ఫోటోను ఎందుకు ముద్రించడం లేదో ఒక్కసారి ఆలోచించల్సిన అవసరం ఉందన్నారు. సివిల్స్ ఐఎఎస్లు, ఐపిఎస్ లు ఆర్బిఐ సృష్టికర్త ఎవరు అంటే ప్రశ్న పత్రాల్లో డా. బి. ఆర్. అంబేద్కర్ అని వ్రాస్తున్నారు. చరిత్రనేమో డా. బి.ఆర్. అంబేద్కర్ అని చెప్తుంటే కరెన్సీ నోట్లు మాత్రం గాంధీ అని చెప్తుంది. ఆర్బిఐ ఏర్పడి 86 సంవత్సరాలైనా డా. బి.ఆర్. అంబేద్కర్ ఫోటోను ముద్రించకపోవడం చాలా బాధాకరం మన్నారు.

Leave A Reply

Your email address will not be published.