ఎమ్మెల్సీ నామినేషన్ కు చిల్లర నాణాలు..అధికారులకు చుక్కలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఖాళీల్ని భర్తీ చేస్తూ కేంద్ర ఎన్నిక సంఘం నోటిషికేషన్ జారీ చేయటం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివిధ విభాగాల ఖాళీల నేపథ్యంలో అధికార పార్టీతో పాటు ఇతర పార్టీల వారు.. ఇండిపెండెంట్లు బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో నామినేషన్ల జోరు మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా విశాఖపట్నం కలెక్టరేట్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. తాజాగా ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్. రాజశేఖర్.పట్టభద్రుడైన అతడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసేందుకు విశాఖ కలెక్టరేట్ కు వచ్చాడు. అతగాడు శ్రీముఖ లింగం దేవాలయ ప్రధాన ఆర్చకుడిగా పని చేస్తుంటాడు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డిసైడ్ అయిన ఆయన.. నామినేషన్ వేసేందుకు విశాఖ కలెక్టరేట్కు వచ్చాడు.నామినేషన్ డిపాజిట్ కట్టేందుకు రూపాయి.. రెండు.. ఐదు రూపాయిల నాణెల్ని తనతో పాటు పెద్ద మూట కట్టుకొచ్చాడు. ఆ చిల్లర మొత్తాన్ని చూసి షాక్ తిన్న సిబ్బంది.. తప్పనిసరి పరిస్థితుల్లో నాణెల్ని కుప్పగా పోసి లెక్కించటం మొదలుపెట్టారు.మొత్తం నలుగురు సిబ్బందితో కలిసి చిల్లర మొత్తాన్ని లెక్కించటం మొదలుపెట్టారు.  నాలుగు గంటల పాటు చిల్లర మొత్తాన్ని లెక్కించిన తర్వాత తీసుకొచ్చిన మొత్తం రూ.6 వేలుగా తేల్చారు. నామినేషన్ డిపాజిట్ కింద కట్టాల్సిన రూ10వేలకు రూ.6 వేలు ఉండటంతో మిగిలిన రూ.4 వేలు చెల్లించారు.దీంతో ఆయన నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి కిందా మీదా పడిన పరిస్థితి. ఇలాంటి నామినేషన్లు ఒకట్రెండు వస్తే చాలు.. తమ పని అయిపోయినట్లే అంటూ వాపోవటం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.