బిజెపి కార్నర్ మీటింగ్ ను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్: తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ గ్రామాలలో తమ బలాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తుంది. దీనిలో భాగంగానే రాష్ట్ర శాఖ పిలుపుమేరకు వివిధ గ్రామాల్లో కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం దామరంచ గ్రామంలో శనివారం కార్నర్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను ఎత్తిచూపుతు బిజెపి పార్టీని గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం చేయాలని పార్టీ క్రియాశీలక సభ్యులకు సూచించారు. కారణం మీటింగ్ జరుగుతున్న సమయంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి మీటింగ్ ని అడ్డుకున్నారు. ఇదే క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఫ్లెక్సీలను చించివేసి టెంట్లను తొలగించారు దీనిపై బిజెపి నాయకులు మండిపడ్డారు. తిరుపతిలో నాయకులు కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. సభాపతి హోదాలో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపక్షాలు సమావేశాలు పెట్టుకుంటే తమ కార్యకర్తలతో అడ్డుకుంటున్నారని ఆ గ్రామ వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎన్ని ఆగడాలు చేసిన ప్రజల్లో మార్పు మొదలైందని దీనిని అధికార పార్టీ తెలుసుకోలేకపోతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.