దళితుల ఐకమత్యమే మా సిద్ధాంతం

- డిహెచ్ పియస్ డివిజన్ అధ్యక్షులు గంగారాం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ బీర్కూర్ : దళితుల మధ్య ప్రస్తుతం ఉన్న అనైఖ్యతను తొలగించి, దళితులను ఏకం చేసి దళితులను ఐకమత్యం చేయడమే దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన సిద్ధాంతమని ఆ కమిటీ బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు కాదేపురం గంగారాం అన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో దళిత హక్కుల పోరాట సమితి బీర్కూర్ మండల కమిటీ ఎన్నికలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళితులకు ఏ గ్రామంలో సమస్య ఉన్నా అక్కడికెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు పాటు పడాలంటే అందరు పిల్లలను చదివించాలన్నారు. ప్రతి ఒక్కరూ చదుకోవాలని, చదువుకుంటే ప్రశ్నించే తత్వం ఏర్పడుతుందన్నారు. ప్రశ్నించే తత్వం ఏర్పడతేనే మన సమస్యలకు సమాధానం దొరుకుతుందన్నారు. దళిత జాతి ఐకమత్యం కోసమే దళిత హక్కుల పోరాట సమితి ఏర్పాటయ్యిందన్నారు. కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి గైని ప్రవీణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు అయ్యాల సంతోష్, వీరాపూర్ సర్పంచ్ సాయిరాం, భైరాపూర్ ఎంపీటీసీ బేగరి అంజయ్య, డివిజన్ నాయకులు కుడుగొల్ల రమేష్,బేగరి సాయిలు, సాయిరాం, నాక్కేవర్ మారుతి, సందుల గంగాధర్, ఎర్రోళ్ల అశోక్, బాలచందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.