కోమటిరెడ్డి ‘ఎవడు.. నాకు తెల్వదు’: షబ్బీర్ ఆలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడతారో.. అధిష్టానంపైన ఏం కామెంట్స్ చేస్తారో ఎవరికీ అంతు చిక్కదు. ఇలా మాట్లాడినందుకు ఎంపీకి అధిష్టానం ఎన్నిసార్లు నోటిసులిచ్చిందో కూడా లెక్కేలేదు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి ఎన్నిసార్లు ఎన్నెన్ని మాటలు అన్నారో చెప్పుకోలేం. అలా ఆయన ఎప్పుడు మీడియా ముందుకొచ్చిన అది మామూలు సంచలనం కాదు పెను సంచలనమే. అందుకే కోమటిరెడ్డిపై సీనియర్లుజూనియర్లు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్దలంతా ఆగ్రహంతో ఊగిపోతుంటారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయ్. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డి గురించి మాట్లాడాలని కాంగ్రెస్ నేతల్లో ఎవరినైనా పలకరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సీనియర్ నేత షబ్బీర్ అలీతో పాటు పలువురు రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలకు  వెళ్లారు. ఈ సమావేశాల్లో షబ్బీర్‌ అలీని కోమటిరెడ్డి గురించి మాట్లాడాలని విలేకరులు అడగ్గా ఒక్కసారిగా రెచ్చిపోయారు.ఎందుకింత రచ్చ అంటే..!

మీడియా : సీడబ్లూసీలో అవకాశం కలిపిస్తే తాను ఇంకా ఉత్సాహంగా పనిచేస్తానని కోమటిరెడ్డి అన్నారు కదా..దీనిపైన మీ రియాక్షన్ ఏంటని షబ్బీర్ అలీని మీడియా అడిగింది.

షబ్బీర్ : ‘ఎవడు కోమటిరెడ్డి.. నాకు తెల్వదు అని సమాధానమిచ్చారు. అంతే.. మరోమాట మాట్లాడకుండానే అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

ఇంత పెద్ద ఎత్తున సమావేశాలు జరుగుతుండగా షబ్బీర్ అలీ పుసుక్కున ఇంత మాట అనేయడంతో ఎందుకిలా అన్నారబ్బా అని ఆలోచనలో పడ్డారు. షబ్బీర్‌ కామెంట్స్ విన్న సమావేశాలకు వచ్చిన నేతలు అసలేం జరిగిందబ్బా అని ఆరా తీసే పనిలో పడ్డారట. మరోవైపు.. ఈ వీడియోను ప్రత్యర్థులు అయితే మీమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మరోవైపు.. తెలంగాణను వదిలి బయటికి వెళ్లినా ఇదే పంచాయితీనేనా..ఇక మీరు మారరా..అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్నెర్రజేస్తున్నారు. అసలు ఈ వివాదాన్ని ఇక్కడ మాట్లాడటమేంటి..అని సీనియర్లు కొందరు గుర్రున ఉన్నారట.నిన్న మొన్నటి వరకూ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే కాంగ్రెస్‌లో నెలకొన్న విబేధాలకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు.. ఆ తర్వాత పరిస్థితి అంతా సద్దుమణిగింది. కానీ కాస్త గ్యాప్‌లోనే ఇప్పుడు షబ్బీర్ కామెంట్స్‌ చేయడం.. అది కూడా ప్లీనరీలో అనడంతో రచ్చ రచ్చ అవుతున్నాయి. ఈ మధ్యనే తెలంగాణలో హంగ్ వస్తుందని కోమటిరెడ్డి కామెంట్స్ చేశారు. ఈ కాక కాంగ్రెస్ నేతల్లో చల్లార్లేదని అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఇన్నర్ టాక్. షబ్బీర్ అలీకోమటిరెడ్డి ఇద్దరూ మంచి స్నేహితులే. పార్టీలో ఇద్దరూ ముఖ్యనేతలే. కానీ.. షబ్బీర్ అలీ ఎందుకిలా అన్నారో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అసలు ఆయన మాటల వెనకున్న అంతరార్థం ఏమిటో ఎవరికి ఎరుకో మరి.!

Leave A Reply

Your email address will not be published.