యూపీ మాజీ ముఖ్యమంత్రి మూలయం సింగ్ కన్నుమూత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గతకొన్నిరోజులుగా గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో వెంటిలేటరైన చికిత్స పొందుతున్న ములాయం.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ములాయం కిడ్నీ, యూరిన్ ఇన్ఫెక్షన్లతో కూడా బాధపడ్డారు. యూపీ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ కీలకపాత్ర పోషించారు. వరుసగా మూడు సార్లు అంతపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే కేంద్ర రక్షణశాఖ మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యే అయిన ములాయం.. మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా గెలిచారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైలుజీవితం గడిపారు. 1989, 1992, 2002లో సీఎం అయ్యారు. ఈయన కుమారుడు అఖిలేష్ సైతం సీఎంగా పనిచేశారు.

Leave A Reply

Your email address will not be published.