తన సోదరి మృతిపై అనేక అనుమానాలున్నాయి

-    ప్రీతి సోదరి పూజ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాకతీయ మెడికల్‌ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థిని ధారావత్‌ ప్రీతి సోదరి పూజ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సోదరి మృతిపై అనేక అనుమానాలున్నాయని తెలిపింది. గిరిజన తెగకు చెందిందనే అందరూ కలిసి తన చెల్లిని ఒంటరి చేశారని పేర్కొంది. ఏకంగా అందరూ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని తన చెల్లిపై చర్చించుకునేవారని తెలిపింది. తోటి పీజీలు, సీనియర్లు అంతా ఒక్కటై తన చెల్లిని వేధించారని పేర్కొంది. విషయంపై హెచ్‌ఓడీ, ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. పోలీసుల విచారణ మధ్యలో ఎందుకు ఆపాల్సి వచ్చిందని ప్రశ్నించింది. నిజా నిజాలు నిగ్గుతేలాలని ప్రీతి సోదరి పూజ డిమాండ్ చేసింది.

ప్రీతి తండ్రి నరేందర్ సైతం నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఓడీని సైతం సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. సస్పెండ్ చేస్తేనే ప్రీతి ఆత్మకు శాంతి చేకూరుతుందని తెలిపారు. సైఫే తన కూతురికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడని చెబుతున్నారు. ఇక ప్రీతి మృతదేహాన్ని నేటి తెల్లవారుజామున ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం..మొండ్రాయి గిర్నితండాకి తరలించారు. మరికాసేపట్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీతి మృతితో ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.

ఇంజక్షన్ తీసుకుని..

ఎంజీఎంలోని అనస్థీషియా విభాగంలో పని చేస్తున్న ప్రీతి తన సీనియర్‌ పీజీ విద్యార్ధి ఎంఏ సైఫ్‌ వేధింపులు భరించలేక మత్తుకు సంబంధించిన ఒక ఇంజక్షన్‌ తీసుకోవడం ద్వారా ఈనెల 22న ఉదయం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అత్యవసర ఆపరేషన్‌ థియేటర్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను మొదట ఎంజీఎం ఆస్పత్రిలోనే అత్యవసర చికిత్స అందిం చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అదే రోజు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందింది. నిమ్స్‌లో చేర్చినప్పటి నుంచి ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. ప్రత్యే క బృందం ఆమె ప్రాణాలను కాపాడేందుకు విశ్వప్రయ త్నం చేశారు. ఆమె అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల చికిత్సకు ఏ మాత్రం స్పందించలేకపోయాయి. ఆరోగ్యం అంత కంతకూ క్షీణిస్తూ వచ్చింది. శనివారం నుంచి ఆమె శరీరం రంగు మారుతూ వచ్చింది.

Leave A Reply

Your email address will not be published.