టీఎస్ ఈసెట్‌ -2023 షెడ్యూల్ విడుద‌ల

-  మార్చి 1వ తేదీన టీఎస్ ఈసెట్‌ నోటిఫికేష‌న్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే టీఎస్ ఈసెట్‌ -2023(TS ECET )షెడ్యూల్ విడుద‌లైంది. మార్చి 1వ తేదీన టీఎస్ ఈసెట్‌ నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. ఈసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివ‌ర్సిటీ వీసీ డి ర‌వీందర్, ఈసెట్‌ క‌న్వీన‌ర్ శ్రీరాం వెంక‌టేశ్‌ క‌లిసి విడుద‌ల చేశారు.

మార్చి 2వ తేదీ నుంచి మే 5వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. రూ. 500 ఆల‌స్యం రుసుంతో మే 8వ తేదీ వ‌ర‌కు, రూ. 2,500తో మే 12వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు తమ ద‌ర‌ఖాస్తుల‌ను మే 8 నుంచి మే 12వ తేదీ వ‌ర‌కు ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. మే 15 నుంచి అభ్య‌ర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. మే 20న ఈసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం https://tsecet.nic.in/ అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

Leave A Reply

Your email address will not be published.