శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి” వారి “8వ వార్షిక బ్రహ్మోత్సవాలలో” భాగంగా “తెలంగాణ తిరుమల దేవస్థానం” (TTD), బీర్కూరు (తిమ్మాపూర్), ” లో ఈరోజు జరిగిన స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు, ఆలయ ధర్మకర్త, తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారంశ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు, పాలకమండలి సభ్యులు, భక్తులతో కలిసి పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా బాన్సువాడ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, సతీమణి శోభ, మరియు రాజ్యసభ సభ్యులు జే. సంతోష్ కుమార్,పార్లమెంట్ సభ్యులు బిబీ పాటిల్. బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికిన శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ప్రజాప్రతినిధులు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా దేవాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి గారు అలిపిరి వద్ద పైలాన్ ను ఆవిష్కరించారు. తరువాత దేవాలయం చేరుకున్న ముఖ్యమంత్రి గారు దాతలు, భక్తులు సమర్పించిన 2 కిలోల స్వర్ణ కీరిటాన్ని స్వామి వారికి సమర్పించారు. అనంతరం కన్నుల పండుగగా జరిగిన “శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి” వారి కళ్యాణంలో పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు, సభాపతి పోచారం,  ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొనగా ఈసందర్భంగాముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను స్పీకర్ పోచారం దంపతులు నూతన పట్టు వస్త్రాలతో సన్మానించారు. శ్రీ వెంకటేశ్వర దేవాలయం తరుపున స్వామి వారి విగ్రహ జ్ఞాపికను ముఖ్యమంత్రికి స్పీకర్ పోచారం బహుకరించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, MP లు కేఆర్ సురేష్ రెడ్డి, బిబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, TSRTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, శాసనసభ్యులు హన్మంత్ షిండే, జాజుల సురేందర్, ఎ జీవన్ రెడ్డి, షకీల్, గణేష్ గుప్తా, శాసనమండలి సభ్యులు విజీ గౌడ, రాజేశ్వరరావు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్లు దాదన్నగారి విఠల్ రావు, దఫేదార్ శోభ రాజు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, SP బి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.