నవీన్ హత్య దర్యాప్తులో పోలీసులు విస్తుపోయే నిజాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నవీన్ హత్య దర్యాప్తులో పోలీసులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. హత్య తరువాత నిందితుడు తన స్నేహితుడు హసన్స్నేహితురాలు నిహారికతండ్రికి ఘటన గురించి చెప్పాడని పోలీసులు తేల్చారు. అందరికీ తెలిసినా ఈ విషయాన్ని ఏ ఒక్కరూ పోలీసులకు చెప్పలేదని ఖాకీలు కన్నెర్రజేస్తున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇక ఇవాళ విచారణలో హరిహరకృష్ణఅతని స్నేహితురాలు ఒక్కరూ సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇంతటి హత్యను కూడా చాలా తేలికగా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి కస్టడీ విచారణ ముగిస్తే ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ త్వరగా పూర్తిచేసేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హరిహరకృష్ణనిహారికను మూడు సార్లు పోలీసులు విచారించారు. అంతేకాదు.. సఖి సెంటర్‌లో కౌన్సిలింగ్ ఇప్పించినా అమ్మాయి తీరు మారలేదని పోలీసులు చెబుతున్నారు. తాము చాలా పేదరికానికి చెందిన వారని.. అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు ఎదుట రోదిస్తున్నారు. కౌన్సిలింగ్ ఇప్పించినాకుటుంబ సభ్యులు ఇంత బాధపడుతున్నా నిహారికలో ఇసుమంత కూడా పశ్చాత్తాపం లేకపోవడం గమనార్హం.

హసన్ పోలీసులకు ఏం చెప్పాడు..?

నవీన్ హత్య కేసులో హరిహరకృష్ణ బెస్ట్ ఫ్రెండ్ హసన్‌ను కూడా పోలీసులు విచారించారు. హత్య తర్వాత నిందితుడు బ్రహ్మణపల్లిలోని హసన్ ఇంటికి వెళ్లాడని పోలీసులు తేల్చారు. అతని చొక్కాపై రక్తపు మరకలతోనే అక్కడికి వెళ్లినట్లు విచారణలో స్పష్టమైంది. అసలేం జరిగింది..ఆ రక్తమేంటి..అని ఫ్రెండ్‌ను ప్రశ్నించినట్లు హసన్ పోలీసులకు చెప్పాడు. ఒక వ్యక్తిని చంపానని నాకు చెప్పాడు కానీ.. ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. మా ఇంట్లో స్నానం చేసి వెళ్ళి పోయాడు. ఆ సమయంలో హరిహరకృష్ణ మద్యం మత్తులో ఉన్నాడు. మా ఇంటిలో ఉన్నప్పుడే చాలా మందికి హరిహర కాల్ చేశాడు. నవీన్‌ను హత్య చేసిన తర్వాత నిహారికకు కాల్ చేసి వరంగల్ వెళ్లాడు. పోలీసుల ఎదుట లొంగిపోవాలని నేను చాలాసార్లు చెప్పాను. హరిహరకృష్ణ మాత్రం తండ్రికి చెప్పిన తర్వాతే పోలీసులు ఎదుట లొంగిపోతానని నాకు చెప్పాడు’ అని విచారణలో పోలీసులకు హసన్ వివరించాడు. అయితే.. అంతా తెలిసినా కూడా కనీసం పోలీసులకు ఎందుకు చెప్పలేదు’ అని హసన్‌పై ఖాకీలు సీరియస్ అయ్యారు. అవసరమైతే మరోసారి విచారణ రావాల్సి వస్తుందని హసన్‌కు పోలీసులు చెప్పారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఏముందంటే..?

నవీన్‌ హత్య కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లోని కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ కాపీని హయత్‌నగర్‌ కోర్టుకు సమర్పించారు. దాని ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడియల్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదివే సమయంలో నవీన్‌ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు. ఆ తర్వాత గొడవలు జరగడంతో.. రెండేళ్ల కిందట విడిపోయారు. ఈ సమయంలో హరిహరకృష్ణ ఆ అమ్మాయికి ప్రపోజ్‌ చేయగా ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. తర్వాత నవీన్‌ఆ అమ్మాయికి తరచూ ఫోన్లుమెసేజ్‌లు చేస్తుండేవాడు. దీంతో నిందితుడు నవీన్‌పై కక్ష పెంచుకుని.. అతణ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడని హయత్‌నగర్‌ కోర్టుకు సమర్పించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు పేర్కొన్నారు. నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసిన తీరు గురించి కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు. ‘‘నవీన్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన హరిహరకృష్ణ.. అతణ్ని బైక్‌ పై నుంచి కింద పడేసిఅతడు తేరుకునేలోగా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత కత్తితో మెడ కోసి.. తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఆ తర్వాత మర్మాంగాన్ని కోసేసి… నవీన్‌ శరీరం నుంచి గుండెను బయటకు తీశాడు. చేతి వేళ్లను కూడా కట్‌ చేసి అక్కణ్నుంచి పరారయ్యాడు’’ అని పోలీసులు పేర్కొన్నారు. బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న సమయంలో కూడా అతని చేతికి గ్లౌజులు ఉన్నాయని వారు అనుమానిస్తున్నారు. హత్యకు ముందుగానే నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించుకుని ఉండవచ్చని వారు భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.