ఒకే దెబ్బకు రెండు పిట్టలు

- కేసీఆర్ ఈటలను బుక్ చేసిన రేవంత్ రెడ్డి..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/వరంగల్: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ బీజేపీలపై ఒకేసారి గురి పెట్టారు.  ఈ రెండు పార్టీలు ఒక్కటేనని చీకటి ఒప్పందాలు చేసుకొని ప్రజలను దోచుకుంటున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.  ఆ పార్టీలో కీలక మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర పై చార్జ్ షీట్ ను విడుదల చేస్తూ.. అటు కేసీఆర్ ను ఇటు ఈటల రాజేందర్ ను అడ్డంగా బుక్ చేసినట్లు తెలుస్తోంది.  ఈటల రాజేందర్ అనేక అక్రమాలకు పాల్పడినా కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ.. అటు కేసీఆర్ ను జైల్లో పెడుతానని ప్రసంగాలు చేస్తున్న బండిసంజయ్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉన్నంత కాలం అనేక అక్రమాలకు పాల్పడ్డారని 9 అంశాలతో కూడిన జాబితాను చదివి వినిపించారు. దీంతో ఈ రెండు పార్టీలపై ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్  చేసిన తప్పులు ఇవి అంటూ ఒక్కో శాఖపై  చార్జీషీట్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ వివరాలను బయటపెట్టింది.బీఆర్ఎస్ లో మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. 2021 ఉప ఎన్నిక ద్వారా ఆయన మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో కొనసాగినంత కాలం అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తన అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకే బీజేపీలో చేరారని అన్నారు. ముఖ్యంగా తాను పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బియ్యం స్కాం జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు తమను మోసం చేశారని రైసుమిల్లర్లే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్టళ్లకు తన పౌల్ట్రీ నుంచి అధిక ధరకు గుడ్లు సరఫరా చేశారని ఇలా కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్యాస్ ప్లాంట్ జాతీయ రహదారుల నిర్మాణాల్లో ఈటల భారీగా కమీషన్లు తీసుకున్నారన్నారు. ప్రజల కోసం ఈటల రాజేందర్ ఎలాంటి పోరాటాలు చేయలేదని తన అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు బీజేపీలో చేరానని అన్నారు. ఇక ఉప ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వలేదని ఆసుపత్రి సిబ్బందిని వేధించి ఓ ఉద్యోగి మరణానికి కారణమయ్యాడని చార్జిషీట్ లో పేర్కొన్నారు. కోటి రూపాయల లంచం తీసుకొని హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ కు సీటు కట్టబెట్టారని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మంత్రి ఇన్ని అక్రమాలకు పాల్పడినా ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆయన భూ కుంభకోణానికి పాల్పడ్డారని హడావుడి చేసి ఆ తరువాత సైలెంట్ ఎందుకయ్యారంటున్నారు.  దీనిని భట్టి చూస్తే కేసీఆర్ ఈటల రాజేందర్ ఎక్కడున్నా ఒక్కటేనని ఆరోపించారు. పైకి వీరు  ప్రత్యర్థుల్లా కనిపిస్తున్నాచీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు.మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వ శాఖల్లోని తప్పిదాలను బయటపెట్టిన కాంగ్రెస్ మొదటిసారి ఓ ఎమ్మెల్యేపై చార్జీషిట్ బయటపెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదీ బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ను టార్గెట్ చేయడంతో అటు బీఆర్ఎస్ లోనూ తీవ్ర చర్చ సాగుతోంది. ఈ తరుణంలో రెండు పార్టీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.