వంట గ్యాస్ ధర పెంపుపై నిరసన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/జుక్కల్ ప్రతినిధి: డోంగ్లి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా మండల భారత రాష్ట్ర సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోడ్డుపై సిలిండర్లతో వారు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విచక్షణ రహితంగా సంవత్సరం సంవత్సరానికి వంట గ్యాస్ ధరలు పెంచు పేద ప్రజల నడ్డి విరుస్తుందని ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల గ్యాస్ బండను నిరుపేదలు కొనలేని దుస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వంట గ్యాస్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామ్ పటేల్, శశాంక్ పటేల్, గాయక్వాడ్ విలాస్, దిగంబర్, మాన్కార్ విజయ్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.