మునుగోడు ఎన్నికల ప్రచారంలో నసురుల్లాబాద్ నాయకులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  మునుగోడు లోని చౌటుప్పల్ రూరల్ మండలం మందోల గూడెం,చిన్నకొండూరు గ్రామ పంచాయతీలలో 3వ రోజు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్న కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండల నాయకులు, ప్రచారాన్ని ప్రారంభించి గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ. అనంతరం నసురుల్లాబాద్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు రైతు బీమా, రైతుబంధు, ఉచిత కరెంట్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్, ఇటీవల కాలంలో 57 సంవత్సరాల్లో నిండిన వారికి ఆసరా పెన్షన్, వికలాంగులకు పెన్షన్, ఒంటరి మహిళలకు పెన్షన్, నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్, గీత కార్మికులకు పెన్షన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను, బీజేపీ ప్రాంతీయ రాష్ట్రాలైన పాలిస్తున్న రాష్ట్రాలు ఇలాంటి పథకాలు ఎక్కడ ప్రవేశపెట్టడం లేదు, దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపగడపకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందజేస్తున్నట్లు ఆయన వివరించారు, మన (బిఆర్ఎస్) టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఆయన వివరించి కారు గుర్తుకు ఓటేసి మన అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని నసురుల్లాబాద్ మండల నాయకులు ప్రజలను కోరారు, కార్యక్రమంలో పాల్గొన్నారు. తెరాస మండల అధ్యక్షులు పెర్క శ్రీనివాస్, ఎంపీపీ విఠల్, జిల్లా కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ మజీద్, ప్రతాప్ సింగ్, నసురుల్లాబాద్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.