నిజాంకు ముచ్చెమటలు పట్టించిన బంజారా యోధుడు ఠానునాయక్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గిరిజన హక్కుల కోసం ప్రాణాలనే త్యాగం చేసిన వీరుడు – ఠానూ నాయక్ అని, ఆయన స్పూర్తితో పోడు పట్టాల కోసం కేసీఆర్ సర్కార్ పై పోరాడండి అని బిజెపి ఎంపీ బండి సంజయ్ అన్నారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు బీజేపీ అండగా ఉంటుంది గిర్ని తండాలో బంజారా యోధుడు జాఠోత్ ఠానూ నాయక్ విగ్రహానికి నివాళులు అర్పించిన బండి సంజయ్ తెలంగాణ భూపోరాటంలో నిజాం చెంచాలకు ముచ్చెమటలు పట్టించిన బంజారా పోరాట యోధుడు జాఠోత్ ఠానూ నాయక్. నమ్మిన సిద్ధాంతంకోసం, బంజారాల హక్కుల కోసం జాటోతూ ఠాను నాయక్ కుటుంబం నిజాం పోలీసులతో ప్రభుత్వంతో పోరాడి నేలకొరిగింది. ఠానూ నాయక్ స్పూర్తితో గిరిజనులంతా ఏకమై పోడు భూములకు పట్టాలు, గిరిజన రిజర్వేషన్ల అమలు కోసం కేసీఆర్ సర్కార్ పై పోరాడండి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

• జనగామ జిల్లా గిర్ని తండాకు వచ్చిన బండి సంజయ్ కుమార్ పార్టీ నేతలతో కలిసి బంజారా యోధుడు జాఠోత్ ఠానూ నాయక్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.. అందులోని ముఖ్యాంశాలు…

• తెలంగాణ భూపోరాటంలో నిజాం చెంచాలకు ముచ్చెమటలు పట్టించిన బంజారా పోరాట యోధుడు జాఠోత్ ఠానూ నాయక్. నమ్మిన సిద్ధాంతంకోసం, బంజారాల హక్కుల కోసం జాటోతూ ఠాను నాయక్ కుటుంబం నిజాం పోలీసులతో ప్రభుత్వంతో పోరాడి నేలకొరిగింది

• ఆరోజు రాళ్లు రప్పలతో గుట్టలున్న 77 ఎకరాలను తొలిచి సారవంతమైన భూములుగా మార్చి ధాన్యరాశులు పండిస్తున్న ఠానూ నాయక్ తండా పై నిజాం చెంచాల కండ్లు పడ్డాయి. పన్ను కట్టాలి లేకుంటే ఆ భూముల్ని లాక్కుంటాం అని పోలీసుల సాయంతో నిజాం అనుచరులు దాడి చేశారు. భూమి మాది, శ్రమ మాది, పండిన పంట కూడా మాదే అని తండావాసులు తిరగబడ్డారు. ఠాను నాయక్ ఆరుగు అన్నదమ్ములు ఈ పోరాటంలో కీలక పాత్ర వహించారు.

• పోరాటం ఉధృతమైంది… నిజాంపోలీసులకు ఠానూ అనుచరులకు మధ్య నెలల తరబడి పోరాటం జరిగింది. తండా వాసులపై నిజాం పోలీసులు అరాచకం చేశారు. భూములు నిజాం కు అప్పగిస్తే తండావాసులందరిని వదిలిపెడతాం అని చెప్పారు.

• మా భూమి మీకెందుకు ఇస్తాం అని ఠాను సోదరులు తిరగబడ్డారు. గెరిల్లా పోరాటం చేశారు. ఠాను నాయక్ ఎక్కడున్నాడో చెప్పాలని పోలీసులు ఠానూ నాయక్ ఇద్దరు సోదరుల్ని గడ్డివాములో వేసి సజీవ దహనం చేశారు.

• అయినా కూడా నమ్మిన సిద్ధాంతం కోసం తన కళ్లముందే తన ఇద్దరు కుమారుల్ని నిట్ట నిలువునా కాల్చేస్తున్నా… ఠాను నాయక్ తండ్రి హాము నాయక్ నోరు విప్పలేదు. చివరికి నిజాం పోలీసుల కుట్రలో ఠానూ నాయక ఒక తండా లో దొరికాడు…

• పోరాటం వదిలిస్తే… ఠానూ నాయక్ ను ప్రాణాలతో వదిలేస్తామని పోలీసులు చెప్పారు. అయితే గిరిజనుల భూములపై హక్కుల కోసం చివరి వరకు పోరాడుతా కాని… నీచ నిజాంకు, ఆయన అనుచరులకు లొంగను అని ఠానూ చెప్పాడు. చివరికి ఎడ్ల బండి చక్రాలకు ఠానూను కట్టేసి నిజాం పోలీసులు గుళ్ల వర్షం కురిపించి చంపారు.

• గిరిజన భూ పోరాటాలు మందలై 70 ఏళ్లు దాటినా నేటికీ వారి సమస్యలు తీరకపోవడం బాధాకరం. ఇప్పటికి పోడు భూముల కోసం గిరిజనులు పోరాటం చేయాల్సి వస్తోంది. తెలంగాణ ఏర్పడగానే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా అని చెప్పినాడు. ఇప్పటికీ 5 సార్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిండు. మోసం చేస్తుండు

• ఈ కేసీఆర్ మరో నిజాం లాగా వ్యవహరిస్తున్నాడు. ఎలక్షన్లురాగానే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా అని కేసీఆర్ గత 5 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నడు. అసెంబ్లీ సాక్షిగా 5 సార్లు హామీ ఇచ్చిన మాట తప్పిన మోసగాడు కేసీఆర్. ఠానూ నాయక్ స్పూర్తితో గిరిజనులంతా ఏకమై కేసీఆర్ సర్కార్ పై పోరాడాలి. గిరిజనుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు బీజేపీ అండగా ఉంటూ పోరాడుతుంది.

Leave A Reply

Your email address will not be published.