సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్న మోదీ-పుతిన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత్-రష్యా సరికొత్త రికార్డ్ నెలకొల్పాయి. రష్యా నుంచి భారత్ ఫిబ్రవరి నెలలో 1.6 మిలియన్ బ్యారెళ్లు ముడి చమురుదిగుమతి చేసుకుంది. ఇది ఇరాక్సౌదీ అరేబియాలనుంచి దిగుమతి చేసుకుంటున్న దానికన్నా ఎక్కువ.2022 ఫిబ్రవరిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 35 శాతానికి చేరుకున్నాయి. భారత్‌కు చమురు దిగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా వరుసగా ఐదో నెలలో కూడా అగ్రస్థానంలో ఉంది. ఈ వివరాలన్నింటినీ ఎనర్జీ కార్గో ట్రాకర్ వొర్టెక్సా అందించింది.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడో అతి పెద్ద దేశం. ఇరాక్ నుంచి భారత్‌కు ఫిబ్రవరి నెలలో 9,39,921 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా సౌదీ అరేబియా నుంచి 6,47,813 బ్యారెళ్ల చమురు దిగుమతి అయింది. యూఏఈ నుంచి భారత్‌కు ఫిబ్రవరి నెలలో 4,04,570 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా అమెరికా నుంచి 2,48,430 బ్యారెళ్ల చమురు దిగుమతి అయింది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాలు ఆర్ధిక ఆంక్షలు విధించడంతో దిక్కుతోచని రష్యా ప్రత్యామ్నాయ మార్గాలు వెతికింది. పుతిన్ సారధ్యంలోని పుతిన్ ప్రభుత్వం భారీ డిస్కౌంట్లు కూడా ప్రకటించింది. దీంతో మోదీ నేతృత్వంలోని భారత్ వెనువెంటనే రంగంలోకి దిగింది. దిగుమతులు ప్రారంభించింది. అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉన్నా భారత్ రష్యా నుంచి నేరుగా చమురు దిగుమతి చేసుకోవడాన్ని మోదీ మార్క్ రాజకీయంగా అంతర్జాతీయ పరిశీలకులు ప్రశంసలు కురిపించారు. అమెరికాతో సంబంధాలు దెబ్బతినకుండానే తన చమురు అవసరాలను తీర్చుకుంటున్న భారత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత విదేశీ నీతిని అన్ని దేశాలూ పొగుడుతున్నాయి. ఇంతెందుకు శతృదేశం పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతి సభలోనూ భారత విదేశాంగనీతిని ఆకాశానికెత్తేస్తున్నారు. పెద్ద టీవీలు, స్క్రీన్‌లు పెట్టి మరీ ఈ దృశ్యాలను పాకిస్థాన్ ప్రజలకు చూపిస్తున్నారు.మోదీ-పుతిన్మధ్య సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధులను ఆ దేశం నుంచి స్వదేశానికి రప్పించడానికి పుతిన్‌ ప్రభుత్వంతో మోదీ సంప్రదింపులు జరిపారు. ఇది యుద్ధాల యుగం కాదంటూ మోదీ పుతిన్‌కు ఇచ్చిన సలహాను అమెరికా, యూరప్ దేశాలు ప్రశంసించాయి. ఇంత ధైర్యంగా రష్యాతో మాట్లాడగలిగే నాయకుడు మోదీ ఒక్కరే అని ఫ్రాన్స్ తదితర దేశాలు అభిప్రాయపడుతున్నాయి.సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్న మోదీ-పుతిన్ తమ సొంత దేశాలకు ప్రయోజనం కలిగేలా చేస్తున్నారు. భారీ డిస్కౌంట్‌లో చమురు కొనుగోలు చేస్తూ భారత్ ప్రయోజనం పొందుతుండగా, అమెరికా, యూరప్ దేశాల ఆర్ధిక ఆంక్షల నుంచి బయటపడటానికి భారత్ రష్యాకు తోడ్పడుతోంది.

Leave A Reply

Your email address will not be published.