డాక్టర్ ప్రీతి కేసు డీజీపీకి సీపీ ఏం చెప్పబోతున్నారు..?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి కేసు కొత్త మలుపులు తిరుగుతోందా..? రేపట్నుంచీ ఈ కేసులో సీన్ మొత్తం మారనుందా..? ఇప్పటికే నిందితుడిని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు ఈసారి కొత్త ప్రయోగం చేయబోతున్నారా..? అందుకే తెలంగాణ డీజీపీ నుంచి వరంగల్ సీపీ రంగనాథ్‌కు ఫోన్ కాల్ వెళ్లిందా..? డీజీపీకి సీపీ ఏం చెప్పబోతున్నారు..? సీపీతో డీజీపీ ఏం మాట్లాడబోతున్నారు..? క్లాస్ తీసుకుంటారా.. లేకుంటే సలహాలు ఇస్తారా..? అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ..! నెలకొంది.

మెడికో ప్రీతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే నిందితుడు సైఫ్‌ నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టగా.. ప్రత్యేక బృందం ఇంకా లోతుగా విచారిస్తోంది. సైఫ్ చెప్పిన సమాచారాన్ని బట్టి సాంకేతికంగా ఏం చేయొచ్చు..? ఎలా ముందుకెళ్లొచ్చు..? అని పోలీసులు ఆలోచిస్తున్నారు. అతి త్వరలోనే ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలని ఉన్నతాధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు విచారణ జరుగుతుండగానే వరంగల్ సీపీ రంగనాథ్‌కు.. డీజీపీ అంజనీకుమార్‌ నుంచి పిలుపొచ్చిందనే వార్త ఇప్పుడు బయటికొచ్చింది. సోమవారం ఉదయం డీజీపీని రంగనాథ్ కలవబోతున్నారు. ఈ మీటింగ్‌పై సోషల్ మీడియాలో, మీడియాలో చిత్రవిచిత్రాలుగా రూమర్స్ వస్తున్నాయి. సోమవారం ఏం జరుగుతోందనే దానిపై జనాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఏం చేయబోతున్నారు..?

డీజేపీ-వరంగల్ సీపీ భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చే అవకాశముంది. ప్రీతి ఘటన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన సీపీ రంగనాథ్.. నిందితుడు సైఫ్ గురించి, ఎలా వేధించారనే దానిపై పూసగుచ్చినట్టుగా వివరించిన విషయం తెలిసిందే. కేసులో ఇప్పటి వరకూ అసలేం జరిగింది..? తర్వాత ఏం చేయబోతున్నారు..? అనేదానిపై ఇద్దరి మధ్య చర్చ జరగనుందట. మరోవైపు.. ప్రీతి ఆత్మహత్యాయత్నం మొదలుకుని ఆమె చనిపోయే వరకూ ఏం జరిగింది..? మొదట ఆస్పత్రికి తరలించినప్పుడు, నిమ్స్‌లో ఏమేం ట్రీట్మెంట్ చేశారు..? విచారణలో ఏం తేల్చారు..? టెక్నికల్‌గా పోలీసులు సంపాదించిన ఆధారాలు ఇవన్నీ ఓ నివేదిక రూపంలో డీజీపీకి రంగనాథ్ సమర్పించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవన్నీ డీజీపీ చూసిన తర్వాత ఎలా ముందుకెళ్లాలి..? అనేదానిపై కొన్ని సలహాలు, సూచనలు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇప్పటి వరకూ ప్రీతి కేసులో మీడియాకు పోలీసులు, ఉన్నతాధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చాలా గోప్యంగానే విచారణ జరుపుతున్నారన్న విషయం తెలిసిందే. అందుకే ఈ విషయాలన్నీ మొదట డీజీపీకి చెప్పిన తర్వాతే మీడియాకు చెప్పాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారట.

Leave A Reply

Your email address will not be published.