దక్షిణ ఫిలిప్పైన్స్‌ లో భారీ భూకంపం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దక్షిణ ఫిలిప్పైన్స్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప లేఖిని పై దీని తీవ్రత 6.0గా నమోదైంది. ఈ ప్రభావంతో మరోసారి భూమి కంపించే అవకాశం ఉందని స్థానిక అధికారులు ప్రజలను హెచ్చరించారు. నష్టం జరిగే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.లమెరికన్ జియోలాజికల్ సర్వే ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణ ఫిలిప్పైన్స్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప లేఖిని పై దీని తీవ్రత 6.0గా నమోదైంది. మధ్యాహ్నం 2.00 గంటల ప్రాంతంలో మిండనావో దీవికి సమీపంలో ఈ భూకంపం సంభవించింది. గోల్డ్ మైనింగ్ ప్రావిన్స్ డావావో డే ఓరో పర్వత ప్రాంతంలోని మరగుసన్ మునిసిపాలిటీకి సమీపంలో 30 సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.జాతీయ రహదారిపై కొండచరియ విరిగిపడిందని, మరగుసన్ విపత్తు నిర్వహణ అధికారి ఒకరు తెలిపారు. కొండచరియ విరిగిపడటం వల్ల జరిగిన నష్టం గురించి తెలుసుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.