పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ మండలంలోని బోర్లమ్ ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మరియు ప్రధానోపాధ్యాయులు కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా పాఠశాలలో మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల గురించి ఎన్నో రకాల కార్యక్రమాలను ముందు తీసుకొని పోతుంది కాబట్టి బాలికలు అందరు కూడా మంచిగా చదివి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని తల్లిదండ్రులకు మరియు అందరికీ మంచి ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా కాబట్టి మీరు కూడా కష్టపడి తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశను నెరవేర్చాలని కోరడం జరిగింది తర్వాత ఆ ప్రధానోపాధ్యాయులు రామచంద్ర మాట్లాడుతూ పూర్వకాలం నుండి మహిళల పట్ల వివక్షత ఉండటం వల్ల మహిళలు అనగతొక్కడం వల్ల వాళ్లు అని రంగాల్లో వెనుకబడ్డారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో కూడా మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రకాల ఉద్యోగాల్లో గాని, అన్ని రంగాల్లో గాని తమ అవకాశాలు Dr BR అంబెడ్కర్ కల్పించారని అన్నారు. రాజ్యాంగంలొ స్త్రీలకు అనుగుణంగా మన పిల్లలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాడానికి అవకాశాలు ప్రభుత్వము కూడా కల్పిస్తుంది. కాబట్టి మీరు కూడా బాగా కష్టపడి తల్లిదండ్రులకు మీ మీద పెట్టుకున్న ఆశను నెరవేర్చాలని కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా మీకు ఎన్నో రకాల ఆశ్రమం పాఠశాలలో కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకొని మీరైతే ఏదో ఒక సంకల్పాన్ని అనుకుంటే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కృషి చేస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు అయ్యల సంతోష్,మౌనిక,SMC చైర్మన్ నర్సింలు,vittal తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.