సిఎం కెసిఆర్ కు కీలక నేత చకిలం ఊహించని షాక్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్యే కోటాలో తనకు కచ్చితంగా పదవి వస్తుందని సీనియర్ నేత, కీలక నేత చకిలం అనిల్ కుమార్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వేచి చూస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో దీన్ని తీవ్ర అవమానంగా భావించిన చకిలం పార్టీకి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా, కీలక నేతగా ఆయన పనిచేశారు. ఒకటి కాదు రెండు కాదు టీఆర్ఎస్ పార్టీలో 22 ఏళ్లుగా ఉంటూ వస్తున్నారు. అంటే.. అభ్యర్థులను ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రచయితగా పేరుగాంచిన దేశపతి శ్రీనివాస్ అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి తోపాటు నవీన్కుమార్ పేర్లను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ అభ్యర్థులు ఈ నెల 9న నామినేషన్లు వేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ముఖ్య నేతలకు కేసీఆర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.