మర్చి 15 నుండి ఒంటిపూట బడులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో ఎండ తీవ్రత పెరుగుతోంది. భానుడు తన ప్రతాపాన్ని పెంచుతున్నాడు. దీంతో ఎండ ప్రభావంతో పాటు ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ ప్రభావం కారణంగా విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి ఒంటిపూట స్కూల్స్ నిర్వహించన్నట్లు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

ఉదయం 7.45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ప్రతి స్కూల్‌లో తప్పనిసరిగా మంచినీళ్లు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. మొత్తం 45 రోజుల పాటు ఈ సారి వేసవి సెలవులు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.