కేసీఆర్ పాలనలో మహిళా సర్పంచుల పై లైంగిక వేధింపులు దుర్మార్గం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/వరంగల్: హనుమకొండ జిల్లా, జానకిపురం దళిత మహిళా సర్పంచ్ పై బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులు తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ పరిపాలనకు నిదర్శనమని బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష అన్నారు.

రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకు శృతి మించుతున్నాయన్నారు.

అధికార మదంతో బీఆర్ఎస్ నాయకులు మహిళలపై దాడులకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాము అధికారంలో ఉన్నామని, ఎవరూ ఏమీ చేయలేరన్న కండకావరంతో బరితెగిస్తున్నారన్నారు.

సొంత పార్టీ నాయకులే నిస్సిగ్గుగా మహిళా సర్పంచ్ పై లైంగిక వేధింపులకు పాల్పడితే…కనీసం స్పందించకుండా డిల్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం MLC కవిత ధర్నా చేయడంలో మతలబు తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. లిక్కర్ స్కాం లో పీకల్లోతు కూరుకు పోయి, జైలు తప్పదని తెలిసీ తండ్రీ.. కూతుర్లు డిల్లీ లో డ్రామా తో సింపతీకోసం వెంపర్లాడుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ సమాజం క్షమించదన్నారు.

మహిళా సర్పంచ్ పై లైంగికంగా, మానసికంగా వేధింపులకు పాల్పడ్డ బీఅర్ఎస్ MLA ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కొప్పు భాషా డిమాండ్ చేశారు.
కల్వకుంట్ల కుటుంబ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాబోయే ఎన్నికల్లో మహిళలంతా ఏకమై బిఆర్ఎస్ పార్టీని బొందవెట్టాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.