ప్రత్యేకమైన కోడ్ లో కవిత చాటింగ్

తెలంగాణాజ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయ ప్రకం పనలు సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. రేపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సిసోడియా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ సంచలన అంశాలు కోర్టు ముందు ఉంచింది. ఈ కేసులో వాట్సాప్ చాట్ను డీ కోడ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పేర్కొంది. ఇతరులకు అర్థం కాకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక కోడ్ వాట్సాప్ చాటింగ్ చేసుకున్నారని వీ- పేరుతో విజయ్ నాయర్, మేడం పేరుతో కవిత, సమీ పేరుతో సమీర్ను ఉద్దేశించి చాటింగ్ జరిపినట్టు ఈడీ తెలిపింది. వీ- నీడ్ మనీ అంటే విజయ్ నాయరు డబ్బు కావాలని కోడ్ గా పెట్టుకున్నా రని, కవితకు 33 శాతం వాటా ఇస్తామని చాటింగ్ లో మాట్లా డుకున్నట్లు ఈడీ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.