వనపర్తి లో రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్/వనపర్తి: వనపర్తి నియోజకవర్గంలోని రాజకీయ ముఖచిత్రం రోజురోజుకు మార్పు వస్తుంది. అక్కడ ప్రధాన పార్టీల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలు వచ్చే ఎన్నికల్లో భారీ ప్రభావాన్ని చూపనున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ కి పలువురు నేతలు రాజీనామా చేసిన ఒకరోజు గడువుల్లోనే కాంగ్రెస్ పార్టీలో సైతం ముసలం మొదలైంది. ఆ పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్నా రెడ్డికి వ్యతిరేకంగాపలువురు కౌన్సిలర్లు తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడం హార్ట్ టాపిక్ గా మారింది. దీంతో రోజురోజుకు మారుతున్న వనపర్తి రాజకీయ సమీకరణాలు ఆసక్తి రేపుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ చర్చ జోరుగా కొనసాగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్ ఎస్   నాయకుల రాజీనామా పర్వం ముగియక ముందే కాంగ్రెస్ లో  సైతం అసమ్మతి స్వరం కట్టలు తెచ్చుకుంది. మాజీమంత్రి ఏసీసీ నేత చిన్నారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి చెందిన వనపర్తి పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని పలువురు కౌన్సిలర్లు రాజీనామాకు సిద్ధమయ్యారు.

ఒకేరోజు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్లో వరసగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు ఆయా పార్టీలో కలకలం రేపుతున్నాయి. పునఃర్వేకీకరణ లక్ష్యంగా ఇరు పార్టీలోని అసమ్మతి నేతల ఐక్యతతో పావులు కదుపుతుండడం, ఆ పార్టీలకు చెందిన ముఖ్య నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. బిఆర్ఎస్ కు    రాజీనామా చేసిన నేతలు ఏ పార్టీలో చేరుతారు అనే చర్చ జిల్లాలో జోరుగా నడుస్తుంది. బీజెపితో పాటు కాంగ్రెస్ నేతలు వారితో టచ్ లో ఉన్నారని, ఎక్కువమంది చేతి వైపే ముగ్గు చూపుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కూడా దొరికిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించలేదని నియోజకవర్గంలో ప్రజలు, అభిమానులు మద్దతుదారుల నుంచి అభిప్రాయ సేకరణలు చేస్తున్నారు. ఆ తరువాతే తగిన నిర్ణయం తీసుకుంటామని జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి స్పష్టం చేశారు. కానీ వారు అంతర్గతంగా పార్టీలకతీతంగా ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకుని లక్ష్యంతో ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. నిరంజన్ రెడ్డిపై తిరుగుబావుట ఎగురవేసిన నాయకులు గతంలో టీడిపి, కాంగ్రెస్లో పనిచేసిన వారే. నిరంజన్ రెడ్డి ఓటమి ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న వారు పునఃర్వేకీకరణతో ఇది సాధ్యమవుతుందని భావించి అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్ లో   ప్రస్తుత నేతలపై పార్టీలో అసమ్మతి ఉండగా తెలంగాణలో ప్రాబల్యం కోల్పోయిన టిడిపి నుంచి గెలవడం సాధ్యం కాదని భావించి అసమ్మతి నేతలు తెరవెనక మెల్లిమెల్లిగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. చిన్నారెడ్డిని బుజ్జగించి రావులను హస్తం గూటికి తీసుకువచ్చి పోటీ చేయించడం, లేకుంటే ఐక్యతగా తమలో ఒకరు ఎవరైనా పార్టీ నుంచి బరిలో నిలవడమే లక్ష్యంగా అన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ అసమ్మతినేతల రాజీనామాలు ఆ తరువాత పరిణామాల క్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. శుక్రవారం వనపర్తిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. ఓ మాజీ ఎమ్మెల్యే డైరెక్షన్ లో ఆడిన నాటకమే జడ్పీ చైర్మన్, ఎంపీపీలు, సర్పంచులు రాజీనామా వ్యవహారం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో అవినీతి అరాచకాలు నియంతృత్వానికి విసిగి ఆత్మాభిమానంతో బయటికి వస్తే మాపై ఏడుస్తారా…రావుల ప్రభావితం చేస్తే లొంగిపోయేంత బలహీనంగా ఉన్నమా అంటూ అసమ్మతి నేతలు కౌటర్ ఇచ్చారు. పార్టీలు మారడం ప్రలోభాలకు లొంగడం రావుల రక్తంలో లేదని, మీ అంతర్గత కలహాల్లో రావులను లాగొద్దు లాగితే ఖబర్దార్ అంటూ టిడిపి నేతలు సామాజిక మాధ్యమాల్లో కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో పలు పోస్టులు వైరల్ గా మారాయి. ఆ పార్టీలో చేరుతారు.. ఈ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు కొట్టి పారేస్తున్న బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అసమ్మతి నేతలు కొన్నాళ్ల క్రితం టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత చిన్నారెడ్డితో వేరువేరుగా భేటీ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. దీంతో పాటు కాంగ్రెస్ కు  రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వనపర్తి, పెబ్బేరు కౌన్సిలర్లు తెల్లారేసరికి స్తబ్దుగా ఉండడంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ పార్టీ అధిష్టానం ఎవరు పోటీ చేస్తారని అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు, అందుకే వారు వినకుండా ఉండిపోయినట్లు చర్చ జరుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.