స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కీలక పరిణామం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో (కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు కీలక నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ మనీలాండరింగ్ ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల మొదటి వారంలోనే నలుగురిని ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 4న నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం వైజాగ్ జైల్లో నిందితులు ఉన్నారనినిందితుల కస్టడీ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు సాగాయి. నిందితుల తరపున వాదించేందుకు ఢిల్లీకలకత్తాముంబై నుంచి న్యాయవాదులు వచ్చారు. విచారణ సోమవారానికి వాయిదా వేసినట్లు న్యాయస్థానం తెలిపింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ఎండీ ఆర్జా శ్రీకాంత్ రెండోవ రోజు విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటలకు విచారణ పూర్తికావడంతో శ్రీకాంత్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఈడీ పేర్కొంది. ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న ఈడీ అధికారులు తెలిపారు. సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్ అరెస్ట్‌తోపాటు డిజైన్‌ టెక్ ఎండీ వికాస్ వినాయక్పీవీఎస్‌పీఐడీ స్కిల్ సీఈవో ముకుల్‌చంద్ అగర్వాల్‌సారా చార్టెర్డ్ అసోసియేట్స్‌కు చెందిన సురేష్‌ గోయల్‌ను అరెస్ట్‌ చేసినట్లు ఈడీ అధికారులు చెప్పారు. నిందితులను విశాఖ ఈడీ కోర్టులో హాజరుపర్చినట్లు అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.